విచిత్రమేమిటంటే రాజకీయాలను రాజకీయాలుగా చూడకుండా వ్యక్తిగతంగా చూస్తున్నారు. అందుకనే చంద్రబాబునాయుడు-జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ –జగన్మోహన్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది. పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ చంద్రబాబు, జగన్ మధ్య మాటల యుద్ధం ఏ స్ధాయిలో జరుగుతోందో అందరూ చూస్తున్నదే. అదే సమయంలో జగన్ పై పవన్ చిమ్ముతున్న విషాన్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు.

 

చంద్రబాబు, జగన్ ఒకళ్ళపై మరొకరు మాటల యుద్ధం తీవ్రంగా నడుస్తోందంటే అర్ధముంది. ఎందుకంటే, వాళ్ళిద్దరు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి. మరి పవన్ కూడా జగన్ పై అదే స్ధాయిలో ఎందుకు విరుచుకుపడుతున్నారో అర్ధం కావటం లేదు. పవనేమీ ముఖ్యమంత్రి కాలేడు. అయినా అలాగే మాట్లాడుతున్నారంటే చంద్రబాబు మద్దతుగానే మాట్లాడుతున్నట్లు అర్ధమైపోతోంది.

 

తాజాగా తిరుపతిలో పవన్ మాట్లాడుతూ జగన్ పై ఎక్కడలేని విషాన్ని చిమ్మటం చూసిన వారికి ఆశ్చర్యమేసింది. సంబంధం లేని విషయాల్లోకి కూడా జగన్ ను లాగి అమ్మనాబూతులు తిడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ చెప్పులేసుకుని వెళ్ళాడట. నిజానికి జగన్ ఎప్పుడూ ఆలయంలోకి చెప్పులేసుకుని వెళ్ళలేదు.  ఇంకా ఎంతకాలమని జగన్ పల్లకీ మోయాలి మనం ? అంటూ మండిపడ్డారు. అసలు జగన్ పల్లకి ఎక్కిందెప్పుడు ?

 

కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి జగన్ ప్రతిపక్షంలోనే కదా ఉన్నది. అధికారంలో ఉంటూ పల్లకిమోయించుకుంటున్న చంద్రబాబును వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉన్న జగన్ పై మండిపడటంలో అర్ధమేంటి ? పైగా కరుణాకర్ రెడ్డి టిటిడి ఛైర్మన్ గా ఉన్నపుడు శ్రీవారి నగలు అమ్ముకున్నాడన్నాడు. శ్రీవారి నగలు మాయమైన ఘటనలు చంద్రబాబు సిఎంగా ఈ ఐదేళ్ళల్లోనే జరిగింది. చూశారా అసలు సంబంధం లేని విషయాల్లో కూడా జగన్ ను టార్గెట్ చేసుకుని విషం చిమ్మటం చూస్తుంటే ఎంతటి ధ్వేషముందో అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: