కేకే సర్వే సంస్థ.. తన కృష్ణా జిల్లా ఓవరాల్ ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం.. తెలుగుదేశం కచ్చితంగా గెలిచే స్థానాలు కేవలం ఒకటి. అంటే ఇక్కడే వేరే ఏ పార్టీ గెలవదని తేల్చి చెప్పినట్టు  అన్నమాట. అలాగే కేవలం వైసీపీ మాత్రమే గెలిచే స్థానాలు.. మూడు.. అంటే ఇక్కడ వేరే ఏ పార్టీ గెలవదన్నమాట.


ఇక జనసేన ఈ జిల్లాలో కచ్చితంగా గెలుస్తుందని చెబుతున్న స్థానం ఒక్కటి కూడా లేదన్నమాట.. కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలు ఉన్నాయి.. ఇప్పుడు టీడీపీ, వైసీపీ కచ్చితంగా గెలిచే స్థానాలు నాలుగు వచ్చాయి కదా. ఇక మిగిలిన పన్నెండు స్థానాల్లో చాలా టఫ్ ఫైట్ ఉన్నదట. 

ఆ టఫ్‌ ఫైట్ ఎవరి మధ్య ఉందంటే.. టీడీపీ, వైసీపీ మధ్య 8 స్థానాల్లో టఫ ఫైట్ ఉందన్నమాట. మరో రెండు స్థానాల్లో వైసీపీ, జనసేన మధ్య టఫ్‌ ఫైట్ ఉంది. అంటే ఇక్కడ టీడీపీ మూడో ప్లేస్ అన్నమాట. ఇక మరో రెండు స్థానాల్లో మూడు పార్టీల మధ్య టఫ్ పైట్ ఉంది. 

సో.. ఈ 12 స్థానాల్లో ఏ పార్టీ అయినా గెలిచే ఛాన్సుందన్నమాట. ఫైనల్‌ గా...

టీడీపీ తక్కువలో తక్కువ 1.. ఎక్కువలో ఎక్కువ 9 స్థానాలు కృష్ణా జిల్లాలో గెలవవచ్చు. 
ఇక వైసీపీ తక్కువలో తక్కువ 3.. ఎక్కువలో ఎక్కువ 11 గెలిచే ఛాన్సుందన్నమాట..
ఇక జనసేన.. మొత్తం మీద.. గరిష్టంగా 4 సీట్లు గెలవచ్చు.. అస్సలు గెలవకపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు..

ఇదీ కృష్ణా జిల్లాపై కేకే సర్వే ఫైనల్ రిపోర్ట్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: