చిత్తూరు జిల్లాలో కుప్పం ఉంది. తమిళనాడు బోర్డర్ గా ఉన్న సీటు ఇది. ఈ సీటుకు 1989 తరువాత మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఆనాడు తొలిసారిగా కుప్పం నుంచి పోటీకి దిగారు చంద్రబాబు నాటి నుంచి ఇప్పటివరకూ ఆరుసార్లు గెల్చిన బాబు ఇపుడు ఏడవసారి మళ్ళీ పోటీకి రెడీ అయ్యారు.


బాబుని బాగా ఆదరించి అక్కున చేర్చుకున్న కుప్పం సీటు ఇపుడు టీడీపీలో కలవరం కలిగిస్తోందంట. ఇక్కడ రాజకీయంగా మార్పులు చాలా వస్తున్నాయి. ముప్పయ్యేళ్ళ పాటు బాబుని మోసిన ఈ సీట్లో ఇపుడు కొత్త ఆలొచనలు  వస్తున్నాయట. దాంతో బాబు కలవరపడుతున్నారని టాక్. కుప్పం అంటే తనకే సొంతం అన్నట్లుగా భావించే బాబులో ఎందుకు ఇంత ఉలికిపాటు వచ్చిందన్నది చూడాలి.
కుప్పానికి బాబు రావడం బాగా తగ్గించేశారు. ఆయన‌ ప్రత్యేక  అధికార త్రాంగాన్ని అక్కడ పెట్టి కధ నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి తరచూ రావడం జరగదు కానీ ఆయన తరఫున వారు ఎవరైనా వచ్చి జనంతో మమేకం అయితే ఆ తీరు వేరేగా ఉండేది కానీ బాబు అలాంటివి పట్టించుకోకపోవడం వల్లనే అసంత్రుప్తి వస్తోందట.


ఐతే బాబు ఇక్కడ ఓడిపోతారని ఎవరూ అనరు, అనలేరు కూడా. టీడీపీకి కచ్చితంగా గెలిచే సీటు ఇది. కానీ ఈసారి బాబు మెజారిటీ మీదనే అంతా కంగారు పడుతున్నారు. గత ఎన్నికల్లో 45 వేల పై చిలుకు ఓట్లు సాధించి అతి పెద్ద మెజారిటీ రికార్డ్ చేసిన చంద్రబాబుకు ఈసారి అందులో ఒక ఓటు తగ్గినా పరాజయం కిందనే భావించాలని అంటున్నారు.
ఇక్కడ వైసీపీ గట్టిగా నిలబడిపోరాడుతోంది.ఆ పార్టీ బీసీ వర్గాన్ని నమ్ముకుంది. చంద్రమౌళి అనే అభ్యర్ధికి టికెట్ ఇచ్చింది. దాంతో వైసీపీ గాలి బాగా ఉంది. ఈ పరిణామాలు బాబు మెజారిటీని తగ్గిస్తాయేమోనని అంతా కలవరపడుతున్నారు.దీంతో ఎన్నడూ లేనిది బాబు సతీమణి భువనేశ్వరి ఇక్కడకు వచ్చి మొత్తం ఎన్నికల వ్యూహాలను, కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. దాంతో పరిస్థితి ఏంటన్నది అర్ధమైపోతోంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: