ఏపీ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎదుటి పక్షంపై అన్నిరకాలు గానూ యుద్ధం చేస్తున్నారు. అందులోకి ఏకంగా పార్టీ అధినేతల కుటుంబసభ్యులనూ లాగుతున్నారు. 


ఇటీవల నారా భువనేశ్వరి కుప్పం వ్యవహారాలు చూసుకుంటున్నారు. చంద్రబాబు బిజీగా ఉండటం వల్ల ఆమె కుప్పం రాజకీయాలను పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఆమె టెలికాన్ఫరెన్సులో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. 

అయితే ఈ ఆడియో గంట సేపటికి వరకూ ఉంది. అందులో కొన్ని చోట్ల పార్టీ సమస్యలను నాయకులు వివరించారు. వైసీపీకి చెందిన కొన్ని ఛానళ్లు, సోషల్ మీడియా వర్కర్లు కేవలం ఈ పార్టీలను ఎక్స్ పోజ్‌ చేస్తూ నారా భువనేశ్వరి డీలా పడిపోయారన్నట్టు ప్రచారం సాగిస్తున్నాయి. 

వాస్తవానికి కుప్పంలో చంద్రబాబుకు ఎదురు ఉండే అవకాశమే లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అక్కడ చంద్రమౌళి అనే ఐఏఎస్‌ను మోహరించారు. ఆయన గత ఎన్నికల్లోనూ ఇక్కడే పోటీ చేశారు. అందువల్ల కొంత మెజారిటీ తగ్గినా తగ్గొచ్చేమో కానీ.. చంద్రబాబుకు అక్కడ ఛాన్సే ఉండదు. కానీ ఇలా కుటుంబ సభ్యులను సోషల్ మీడియాకు ఎక్కించడం భావ్యం కాదంటున్నారు విశ్లేషకులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: