ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంచడం కామన్ అయ్యింది. కాకపోతే ఈ విషయంలో నేతలు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. సంప్రదాయ విధానాల్లో డబ్బు పంచడానికి ఇబ్బందులు ఎదురవుతున్నందువల్ల కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. 


ఎన్నికల్లో ఓటు విలువ పెరిగింది. పంచే నాయకులపై నమ్మకం తగ్గింది.. పైస్థాయి నుంచి డబ్బు ఇచ్చినా అది ఓటరుకే వెళ్తుందన్న నమ్మకం నాయకుల్లో తగ్గుతోంది. అందుకే పారదర్శకత కోసం కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్నిచోట్ల ఓటుకు రెండు నుంచి మూడు వేల రూపాయలు సొమ్ము ముట్టజెపుతున్నారు. 

నేరుగా డబ్బు ఇవ్వడం ఇబ్బంది కాబట్టి.. ఓ ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే.. 10 నుంచి 15 వేల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులు కానీ.. బంగారు నగలు తెచ్చుకోవడానికి కానీ అవకాశం ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ షాపులు, నగల దుకాణాల వారితో నాయకులు టై అప్ అవుతున్నారు. 

అంతే కాదు.. కొన్ని చోట్ల పేటీఎం, గూగుల్ పే ద్వారా కూడా సొమ్ములు ఖాతాల్లో వేస్తున్నారు. మరికొందరు నేతలు డొల్ల కంపెనీలు సృష్టించి.. ఆ కంపెనీల్లో కాంట్రాక్టు పని చేస్తున్నట్టు చూపుతూ ఖాతాల్లోకి డబ్బు మళ్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల కూపన్లు పంచుతూ.. ఆ కూపన్లకు తగిన సొమ్ము కానీ.. వస్తువులు కానీ ఇస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: