రూరల్ మీడియా.. ఆంధ్రప్రదేశ్ గురించి సమగ్రంగా అధ్యయనం చేసే సంస్థ ఇది. లాభాపేక్ష లేకుండా సేవా భావంతో పని చేసే సంస్థ. ఈ సంస్థ తన నెట్‌ వర్క్ ను ఉపయోగించి సర్వే చేసింది. దాని ఫలితాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని  రూరల్‌ మీడియా ర్యాండమ్‌ సర్వేలో స్సష్టంగా తేలింది. 


ఫిబ్రవరి 3 నుండి మార్చి నెలాఖరు వరకు, రాస్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో మారుమూల పల్లెల్లో నిర్వహించిన ఈ సర్వేలో ప్రజల స్సందన తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకుంటారు? అని ప్రజల ప్రైవసీలోకి వెళ్లకుండా,

ప్రభుత్వ పనితీరు పై మాత్రమే అభిప్రాయాలు తెలుసుకొని, వారు ఏ పార్టీ వైపు ఉన్నారనేది అంచనా వేసిందీ సంస్థ.
కొందరైతే డైరెక్టుగా తమ మద్దతు ఏ పార్టీకో తేల్చి చెప్పారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం కొంత ఉన్నప్పటికీ, మిగతా   అన్ని ప్రాంతాల్లో టీడీపీ,వైఎస్‌ఆర్‌సిపి మధ్యనే స్రధాప పోటీ ఉంది.

మీ నియోజక వర్గంలో అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు అని అడిగితే, ఎక్కువ శాతం ఓటర్లు స్థానికంగా పోటీచేస్తున్న అభ్యర్థి గతంలో ప్రజా సమస్యలు పట్టించుకున్నారా? లేదా అని చూస్తామన్నారు. 

సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.. 

సర్వేలో 175 అపెంబ్లీ సీట్ల అంచనా ఫలితాలు 

వైఎస్సార్‌ సిపి – 102 
తెలుగుదేశం పార్టీ -72 
జనసేన – 01 , కాంగ్రెస్‌-00 , బీజేపీ-00 



మరింత సమాచారం తెలుసుకోండి: