చూడబోతే అలాగే ఉంది. లేకపోతే అధికారపార్టీ ఎంపి ఇంటిపై రాష్ట్రప్రభుత్వ పరిధిలోని పోలీసులు దాడులు చేయటమేంటి క్యామిడి కాకపోతే. సిఎం రమేష్ అంటే తెలుగుదేశంపార్టీలో ఎంత కీలక వ్యక్తో అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడుకు చాలా సన్నిహితుడన్న విషయం కూడా అందరికీ తెలుసిందే. అలాంటిది  అలాంటి రమేష్ ఇంటి మీద  రాష్ట్రప్రభుత్వ ఆధీనంలోని పోలీసులు దాడులు చేశారంటే ఎవరూ నమ్మటం లేదు.

 

మొన్నటి వరకూ ఐటి దాడులు జరిగాయి. కాబట్టి నరేంద్రమోడినే చేయించారని అన్నారు. సరే ఎన్టీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేశారు కాబట్టి ప్రధానికి ఆ కోపంతో టిడిపి పారిశ్రామికవేత్తలు కమ్ నేతల పై ఐటి, ఈడి దాడులు చేయిస్తున్నారని  ఆరోపణలు చేశారు. మీడియా మద్దతుంది కాబట్టి మోడిపై ఒకటే గగ్గోలు పెట్టేస్తున్నారు.

 

అలాంటిది హఠాత్తుగా  ఇపుడు రాష్ట్ర పోలీసులే దాడులు చేశారంటే అర్ధమేంటి ?  మొన్ననే కడప జిల్లా మైదుకూరులో టిడిపి అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ పై మొన్ననే ఐటి దాడులు జరిగాయి. దాన్ని మోడి కక్షసాధింపు చర్యలన్నారు.  మరి రాష్ట్ర పోలీసులే టిడిపి ఎంపిపై జరిపిన దాడిని ఏమంటారు ? పైగా ఎస్పీ ఆదేశాలతోనే తాము సోదాలకు వచ్చినట్లు పోలీసులు చెప్పారట.

 

టిడిపి ఎంపి ఇంట్లో సోదాలు చేయమని ఎస్పీ ఆదేశాలిచ్చారంటే ఎవరైనా నమ్ముతారా ? ఒకవేళ నిజంగానే ఎస్పీ ఆదేశాలిచ్చారంటే ఏ చంద్రబాబో లేకపోతే హోం మంత్రో ఎస్పీకి ఆదేశాలిచ్చుండాలి. అందుకనే కనీసం సెర్చి వారెంట్ కూడా లేకుండానే ఎంపి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అంతసేపు సోదాలు చేసినా ఎంపి ఇంట్లో ఏమీ దొరకలేదని చెబుతున్నారు.

 

జరిగినదంతా చూస్తుంటే అందరిలోను ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి. తన ఇంటిపై తానే పోలీసులతో దాడులు చేయించుకుని ఉంటారని జనాలను అనుకుంటే అది వారి తప్పు కాదు. ఇక్కడ విచిత్రమేమిటంటే,  రాష్ట్ర పోలీసులు దాడి జరిపినా ఎంపి మాత్రం కక్ష సాధింపనే అంటున్నారు. మొత్తానికి టిడిపి డ్రామా బాగా రక్తికట్టిందని జనాలు అనుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: