రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు..అందరూ తాత్కాలిక సహా నాయకులు, ప్రత్యర్థులే.. చంద్రబాబు నాయుడు, వారి తెదేపా మాత్రం జగన్ ను, వైసీపీని ప్రత్యర్థి కంటే శత్రువుగానే చూసింది, చూస్తుందంటున్నారు ఆంధ్రప్రజ.  మూడు పదులు దాటిన రాజకీయ చరిత్ర బాబుది, ఏనాడు ప్రవర్తించని విధంగా జగన్ పైనే ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


అరెస్టు చేస్తానన్న మోదీని వాటేసుకుని, శాలువా కప్పి, లడ్డూ ప్రసాదం చేతిలో పెట్టగల స్థాయి, లౌక్యం.  ఇటలీ దెయ్యం అని తిట్టిన సోనియా కుటుంబంతో చేతులు కలపడం..రాహూల్ గాంధీని అంతా తానే అయి నడిపిస్తున్నట్లు ఫోటోలు దిగి మీడియాలో ప్రచారం చేయగల సామర్థ్యం ఉన్న బాబుకి జగన్, జగన్ పార్టీ ప్రత్యర్థి స్థాయిని దాటి శత్రువులాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని అర్థంగాక బుర్ర గోక్కుంటున్నారు విశ్లేషకులు.


సరే ఈ ప్రత్యర్థి - శత్రువు విషయం పక్కన బెడితే.. బాబు తీసుకుంటున్న లైన్ మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మొన్నామద్య వివేకా కూతురును ఉపయోగించుకొని జగన్ మీద విమర్శల జల్లెత్తారు, ఇప్పుడేమో అద్వానిని ఉపయోగించుకొని మోడీ మీద ధ్వజమెత్తుతున్నారు. శత్రువు-శత్రువు మిత్రుడే కానీ..శత్రువు-మిత్రుడు?


మరింత సమాచారం తెలుసుకోండి: