ఏపీలో మార్పు సూచనలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. ఓవ్ వైపు జగన్ సభలకు జనం పోటెత్తుతున్నారు. ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా వస్తున్న జనం నీరాజనం పడుతున్నారు. ఇది ఒక్కటి చాలు ఏపీలో మార్పు ఎంత బలంగా ఉందన్నది చెప్పడానికి. 


మరో వైపు చలువ పందిళ్ళు వేసి, ఎండ కాస్త తగ్గాక టీడీపీ ఎన్నికల సభలను చంద్రబాబు నిర్వహిస్తున్నారు. అక్కడకు జనం వస్తున్నా వారిలో జోష్ ఎక్కడా కనిపించడంలేదు. చంద్రబాబు ప్రసంగం సైతం రొటీన్ గా ఉంటోందన్న విమర్శలు కూడా ఉన్నాయి.పోలింగ్ కి ఇంకా నాలుగు రోజులు మాత్రమే వ్యవధి ఉంది. గాలి ఎటు అన్నది కూడా తెలుస్తోంది. ఈ సమయంలో జగన్ ఈ రోజు చేసిన ట్వీట్ వైసీపీ అధినేత నుంచి సీఎం హోదాలోకి వస్తూ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే తన విజన్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాజాగా ట్విటర్‌లో పేర్కొన్నారు.


పారదర్శక పాలనతో, నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, అవినీత రహిత, వికేంద్రీకృత ప్రభుత్వంతో ప్రజల ఇంటి వద్దకే పాలన అందేలా, స్థిరమైన అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే తన విజన్‌ అని తెలిపారు. దీన్ని చూస్తూంటే  మాత్రం జగన్ ఏపీ సీఎం తాను తప్పక అవుతానన్న అంచనాకు వచ్చేసినట్లుగానే కనిపిస్తోందంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: