ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని రౌడీ రాజ్యాంగం మారుస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది అని అంటున్నారు మేధావులు. రౌడీ దర్బార్ దిశగా మళ్లీ ఆంధ్ర ప్రదేశ్ వెళుతున్నట్లు..ఒకానొక సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపారాలు చేసే సమయంలో బూత్ లెవల్ నుండి నగర స్థాయి రాష్ట్ర స్థాయి వరకు పొలిటికల్ లీడర్ లతోపాటు రౌడీలు కూడా మామూలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి.


దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చూసిన వ్యాపార దిగ్గజాలు అప్పట్లో రాష్ట్రంలో ఉన్న రౌడీయిజాన్ని చూసి చాలామంది వెనక్కి తిరిగి వెళ్లిపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే విభజన జరిగిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే రౌడీ రాజ్యాన్ని తలపిస్తోందని కామెంట్లు వినబడుతున్నాయి.


పోలీసు వ్యవస్థ ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటూ తన పార్టీకి చెందిన రౌడీలను సామాన్య జనం లోకి దింపి ఎన్నికల ముందు భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను బట్టి అర్థం అవుతుంది అని అంటున్నారు చాలామంది రాజకీయ నేతలు.


ఇటువంటి అరాచకాలు రాష్ట్రంలో ఇలానే జరిగితే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు ఉండవని సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికే రోజులు వస్తాయని ...అధికారంలో ఉన్న రాజకీయ నేతలు హుందాగా వ్యవహరించాలని లేకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే దాఖలాలు ఉన్నాయని అంటున్నాడు రాజకీయ మేధావులు.



మరింత సమాచారం తెలుసుకోండి: