టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం ఊహకు అందదు. ఆయ్నన పోకడలు కూడా ఎవరికీ అర్ధం కావు. తనదైన రాజకీయం చేయడంలో అయన దిట్ట. ఎప్పటికి ఏది అవసరమో తెలుసుకుని దానికి అనుగుణంగా మలచుకోవడంలోనే బాబు నలభయ్యేళ్ళ రాజకీయం విజయం ఆధారపడిఉంది.


ఇదిలా ఉండగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్న చంద్రబాబుకు కమలం పార్టీలో మిత్రులు ఉన్న సంగతి తెలిసిందే. తనకు బీజేపీతో వైరం లేదని, కేవలం మోడీ షాలతోనేనని టీడీపీ నేతలు కూడా ఇంటర్నల్ గా అంటూంటారని భోగట్టా /  అయితే ఎటువంటి విభేదాలు ఉన్నా బాబు సులువుగా వాటిని పరిష్కరించుకోగలరన్నది అందరికీ తెలిసిందే.
ఆయన రాజకీయ అవసరాలే శత్రువులు  మిత్రులు తప్ప వ్యక్తిగతంగా ఏదీ ఉండదని తెలిసిందే. ఈ నేపధ్యంలో నిన్న గుంటూర్లో పర్యటించిన అమిత షా బాబు మీద హాట్ కామెంట్స్ చేశారు. మళ్ళీ చంద్రబాబు ఎండీయేలోకి వచ్చినా తాము చేర్చుకోమని సంచలన ప్రకటనలు చేసారు. దీని భావమేని పరమేశా అని ఇపుడు ఏపీవ్యాప్తంగా చర్చ సాగుతోంది.


వైసీపీ అయితే ఈ విషయంలో అనుమానాలు బాగా ఉన్నాయట. దానికి ఎన్నో ఉదాహరణలు చెబుతున్నారు. కేఏ పాల్ పార్టీ గుర్తు, వైసీపీ గుర్తు ఒక్కటి అని చెప్పినా ఈసీ స్పందించకపోవడమేంటని గుస్సా అవుతున్నారు. అలాగే ఏపీలో డీజీపీని తొలగించాలని, ఇతర అధికారులను తప్పించాలని కోరినా కేంద్రంతో పాటు, ఈసీ కూడా పట్టించుకోకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక దీని మీద వైసీపీ నేత సజ్జల రామక్రిష్ణా రెడ్డి మాట్లాడుతు,  టీడీపీ అభ్యర్థి ఇంట్లో ఐటీ రైడ్ జరిగితే సీఎం రమేష్ ఏకంగా ఐటీ అధికారులనే బెదిరించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు


.
ఇటీవలి పరిణామాలు చూస్తుంటే కేంద్రం చంద్రబాబుకు సహకరిస్తోందని అనుమానం కలుగుతోందన్నారు. ఓ వైపు ఇంత శతృవులుగా చెబుతున్నా మరోవైపు ఎన్నికల తర్వాత బీజేపీతో మళ్లీ చంద్రబాబు కలిసేందుకు వస్తారని అమిత్ షా నిన్న చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు  కేఏ పాల్ మా ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, కండువా, ఎన్నికల గుర్తు, అభ్యర్థుల పేర్లు కూడా ఒకేలా ఉన్నాయని తాము అధారాలతో సహా చెప్పినా ఈసీ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు.
 ఎన్నికల వేళ చంద్రబాబు కేంద్రంపై పోరాడుతున్నట్లు డ్రామా చేస్తున్నారని, అంతర్గతంగా చంద్రబాబుతో బీజేపీకి ఏమైనా అవగాహన ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మరి ఇదే కనుక నిజమైతే మాత్రం బాబు మాస్టర్ మైండ్ కి జోహార్ చెప్పాల్సిందేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: