జనసేన పార్టీ మార్పు కోసం పుట్టిందని అంతా భావిస్తారు. అ పార్టీ ఏర్పాటుతో ఎందరికో యువతకు పోటీ చేసే అవకాశాలు వచ్చాయని కూడా పవన్ చెబుతూంటారు. తమది అన్ని రాజకీయ పార్టీల లాంటిది కానే కాదని కూడా అంటారు.అలాగే తాము కష్టపడే వారిని గుర్తిస్తామని కూడా అంటూంటారు.


అయితే ఆచరణలో మాత్రం అందరి లాంటి పార్టీయేనని అంటున్నారు. అక్కడ ఇతర పార్టీల నాయకులను పవన్ ఎపుడైతే చేర్చుకున్నారో అపుడే జంపింగులు ఉంటాయి. గొడవలు ఉంటాయి. విభేదాలు, అలకలు, చివరికి పార్టీని వీడిపోవడాలు కూడా ఉంటాయి. ఇలా చాలా చోట్ల ఇప్పటికే జనసేన పార్టీని వీడిపోతున్నారు. ఈ నేపధ్యంలో విశాఖలో జనసేన పార్టీ ఆఫీసుని ప్రారంభించిన కీలక నేత గుంటూరు నరసిమ్హమూర్తి, ఆయన సతీమణి భారతి కూడా ఈ రోజు హైదరాబాద్లో లోటస్ పాండ్ లో జగన్ని కలసి పార్టీలో చేరిపోయారు.


కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న గుంటూరు నరసిమ్హమూర్తి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కూడా అప్పట్లో పనిచేశారు. తరువాత జనసేన ఏర్పాటు కావడంతోనే మొదటిగా  ఆయన ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. పైగా విశాఖ జనసేన పార్టీ ఆఫీస్ ని కూడా ఏర్పాటు చేశారు. అలా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఆయన విశాఖ ఉత్తరం టికెట్ తన భార్యకు కానీ, తనకు పెందుర్తి టికెట్ కానీ ఆశించారు. అయితే జనసేన అధినాయకుడు పవన్ టికెట్ నిరాకరించారు. ఇక భారతి అప్పట్లో అంటే 2014లో కాంగ్రెస్ తరఫూ విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి మంచి ఓట్లనే తెచ్చుకున్నారు. ఈ నేతలు ఇపుడు వైసీపీలో చేరడంతో ఆ పార్టీ బలం అక్కడ పెరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: