రూరల్ మీడియా అందించిన సర్వే ప్రకారం వైసీపీ పార్టీ అధికారం లోకి వస్తుందని జర్నలిస్ట్ సాయి పేర్కొన్నారు. అయితే ఈ సర్వే పార్టీ సానుకూలతలను బట్టి నిర్ణయించినవి అని సాయి అన్నారు. టీడీపీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీ కి బాగా కలిసివచ్చింది అని అన్నారు.ప్రజలు హోదా విషయం ను పెద్దగా పట్టించుకోవట్లేదు, తెలంగాణ రాష్ట్ర విభజనను కూడా లైట్ తీసుకున్నారని ఈ సర్వే చెబుతుంది.

అయితే ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అని అంటూ సర్వేలు వెల్లడిస్తున్నాయి అన్నారు.దాదాపుగా మూడు జిల్లాలో సంక్షేమ పథకాలు బాగా కలిసివచ్చాయని, అలాగే సీతంపేట,పాడేరు ప్రాంతాలలో రోగుల చికిత్స బైక్ అంబులెన్స్ ద్వారా జరుగుతున్నందుకు మంచి పేరు వచ్చిందని. అలాగే పసుపు - కుంకుమ, స్మార్ట్ ఫోన్ మరియు పంటకుంట వల్ల కొంచెం సానుకూలత వచ్చిందని సర్వే వెల్లడించింది.

వైజాగ్, శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో చేపలు పట్టి ఎండపెట్టడానికి ప్రదేశాన్ని ఇచ్చి అలాగే సోలార్ విద్యుత్ ను అందించడం ద్వారా చాలా కుటుంబాలు బాగు పడ్డాయని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన అనేక పథకాలను టీడీపీ పార్టీ ప్రవేశ పెట్టీ మంచి సానుకూలతను సంపాదించింది అని చెప్పారు.

రోడ్లు మరియు కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అలాగే రుణమాఫీ విషయంలో ఇస్తానన్న మొత్తం ఇవ్వకపోవడం ప్రజలు తిరగపడ్డారని చెప్పారు. వైసీపీ 101 స్థానాలు, టీడీపీ 72 స్థానాలు, జనసేన 1 స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది అంటూ ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: