ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత బీజేపీతో ఎంతో సన్నిహితంగా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.  ఏపి ప్రత్యేక హోదా విషయంలో ఎన్టీయే షాక్ ఇవ్వడంతో ఆ బీజేపీకి బద్ద శత్రువుగా మారిపోయారు బాబు. అప్పటి నుంచి కేంద్రాన్ని టార్గెట్ చేసుకొని ఎన్నో విమర్శలు చేయడం మొదలు పెట్టారు.  ఏపిలోని టిడిపి వారిపై కేంద్ర వ్యవస్థలతో మోది దాడులు చేయిస్తున్నారని ఏపి సియం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదని, వీరికి ప్రజలు ఓటుతోనే బుద్దిచెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 


పౌరుషానికి ప్రతీకగా శనివారం సాయంత్రం కాగడాల ప్రదర్శన నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగుజాతి కీర్తిని చాటుతూ ఈ కాగడాల ప్రదర్శన సాగాలని దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రార్ధనలు, పూజలు నిర్వహించాలని, కుట్రలపై సర్వమతాలు తమకు అండగా నిలుస్తాయని సియం ఆకాంక్షించారు.  8,9 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వీర తిలకం దిద్ది పౌరుషాన్ని రగిలింపచేయాలని సియం సూచించారు. 


ఇదిలా ఉంటే చంద్రబాబు నాలుగు సంవత్సరాలు మోదీతో చెట్టా పట్టాలేసుకొని తిరిగి ఇప్పుడు నీచుడు..దుర్మార్గుడు అంటూ మాట్లాడటం..ప్రజలు విశ్వసించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ప్రతిపక్ష పార్టీలో ఆరోపించినట్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబు కే సాధ్యం అని విమర్శిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: