కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ అనిల్ చంద్ర పునేఠాపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా ఎల్‌వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 


ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇటీవల పునేఠా వ్యవహరించడమే ఈ బదిలీకి కారణమని తెలుస్తోంది. ఇటీవల ఈసీ ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే  ఈవిషయంలో చంద్రబాబు సర్కారు అతి చేసిందన్న విమర్శలు వచ్చాయి. ఏకంగా ఈసీ

ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇంటలిజెన్స్ డీజీ బదిలీ ఉత్తర్వులను నిలిపేసింది. దీంతో ఈసీ హైకోర్టుకు వెళ్లి మరీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయించింది. ఈ మొత్తం వ్యవహారంలో పునేఠా జీవోలు జారీచేశారు. చంద్రబాబు ఒత్తిడికి ఆయన తలొగ్గినట్టు పునేఠాపై ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈయనకు ఈసీ షాక్ ఇచ్చింది.

ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎల్‌వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా కొనసాగనున్నారు. చంద్రబాబును నమ్ముకుని ఆయన చెప్పినట్టు జీవోలు ఇవ్వడమే పునేఠా ఉద్యోగానికి ముప్పు తెచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం సీఎస్‌ గా నియమితులైన ఎల్‌వీ సుబ్రహ్మణ్యం 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఏపీలో ఆయనే అందరి కంటే సీనియర్ ఐఏఎస్‌. 



మరింత సమాచారం తెలుసుకోండి: