చంద్రబాబు ఓటమి ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు బయటి పెట్టాయి. అయితే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సానుభూతి కోసం నన్ను జైల్లో పెడతారు .. అయినా పోరాడతానని చెబుతున్నాడు. అయినా తప్పు చేయకపోతే ఎవరైనా జైల్లో ఎందుకు పెడతారు. విశాఖ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పునేఠ ను ఎన్నిక‌ల సంఘం బ‌దిలీ చే సింద‌నే స‌మాచారం ముఖ్య‌మంత్రి కి అందింది. అప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల ప్ర‌చారం లో ఉన్న చంద్ర‌బాబు ఒక్క‌సారిగా ఫైర్ అయ్యారు. కేంద్ర ప్ర‌భుత్వం..మోదీ త‌న‌ను ఏకాకి ని చేసి ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండి ప‌డ్డారు.


నేనే ఏం త‌ప్పు చేసాను అని ప్ర‌శ్నించారు. నేను వారికి ఊడిగిన చేయాలా అని నిల‌దీసారు. ఎటువంటి త‌ప్పు చేయ‌ని ఇంట‌లి జెన్స్ డిజి..సీయ‌స్ ను బ‌దిలీ చేసార‌ని మండి ప‌డ్డారు. రెండు రోజుల్లో న‌న్ను అరెస్ట్ చేస్తారు..జైళ్లో పెడ‌తారు అయినా స‌రే జైళ్లో కూర్చుంటా..భ‌యప‌డ‌ను అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ప్ర‌ధాని మోదీని వదిలేది లేద‌ని..అంతు చూస్తామ‌ని చెబుతూనే ఖ‌బ‌డ్దార్ మోదీ అంటూ హెచ్చ‌రించారు.  


ప్ర‌జాస్వామ్యాన్ని విలువ లేకుండా చేసిన ప్ర‌ధాని మోదీ..బిజెపి జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా కు బుద్ది చెప్పాల‌ని పిలుపు నిచ్చారు. టిడిపి అభ్య‌ర్దుల‌ను లక్ష్యంగా చేసుకొని ఐటి దాడులు చేస్తున్నార‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ధ‌ర్మ పోరాటం చేయ‌ట‌మే నేను చేసిన త‌ప్పా అని ప్ర‌శ్నించారు. వైసిపి దొంగ ఓట్ల పై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తే ప‌ట్టించుకోలేద‌ని వివ‌రించారు. ఎన్నిక‌ల సంఘం ఖ‌చ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: