చంద్రబాబు అపర చాణక్యుడు.. ఆయన రాజకీయ దురంధరుడు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చక్రం తిప్పగలిగినవాడు..ఇవీ తరచూ చంద్రబాబు గురించి వినిపించే మాటలు. అంతే కాదు.. ఆయన సంపద సృష్టికర్త. ఆయన కారణంగానే రాష్ట్రం ఈ మాత్రం ఉంది.. అని కూడా అంటుంటారు. 


కానీ అవన్నీ వట్టిమాటలేనా..? చంద్రబాబు ఫైనాన్షియల్ మేనేజ్‌ మెంట్‌లో ఘోరంగా విఫలమయ్యారా.. ఏపీ ఖజానాను ఖాళీ చేసేశారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. ఏపీ ఖజానా దాదాపు ఖాళీ అయ్యింది. 

కేంద్రం నుంచి పన్ను వాటాల్లో భాగంగా వచ్చిన వేల కోట్ల  సొమ్ము రోజుల వ్యవధిలోనే ఖర్చయిపోయంది. పసుపు కుంకుమ, అన్నదాతా సుఖీభవ, నిరుద్యోగ భృతి వంటి పథకాలకోసం ఆ సొమ్మును వెంటనే డ్రా చేయడంతో ఇప్పుడు ఏపీ ఖజానా దాదాపుగా ఖాలీ అయ్యందట. 

ఇప్పటికే వివిధ బిల్లులు వేల కోట్ల మేరకు నిలిచిపోయాయట. డబ్బులు లేని కారణంగానే బిల్లుల చెల్లింపులన్నింటినీ నిలిపేసారట. చివరకు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, వివిధ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాలు, ఇతర పథకాల్లో బాగంగా కడుతున్న భవంతులకు సంబంధించిన బిల్లులు కూడా నిలిపేశారట. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఎవరు సీఎంగా వచ్చినా సంక్షేమ పథకాల అమలు కత్తిమీద సామే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: