చింతమనేని ప్రభాకర్.. ఏపీలో బాగా పేరున్న ఎమ్మెల్యే.. పేరంటే అభివృద్ధితోనో.. మంచి మార్కులతోనో వచ్చిన పేరు కాదండోయ్.. నిత్యం వివాదాలతో ఆయన పేరు మారుమోగిపోయంది.. ఈ ఐదేళ్లూ.. అలాంటి చింతమనేని సీఎం చంద్రబాబే కంట్రోల్‌లో పెట్టలేకపోయాడని చెబుతారు. 


అలాంటి వాడిని వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల ఎన్నికల ప్రచారంలో కడిగిపారేసింది. అలా ఇలా కాదు.. ఒక రేంజ్‌లో కడిగేసింది.. ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకెళ్లాడు.. దరిద్రుడు కదా వీడు.. అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు.. ఆయన్ను కన్నది
ఓ మహిళ కాదా.. మహిళలపై అరాచకం చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. 

చింతమనేనిపై 38 రౌడీషీట్లు ఉన్నాయట.. మన ప్రభుత్వం వచ్చాక అవన్నీ బయటకు తీద్దాం అని ఆమె చెప్పారు. మీరు ఓడించండి.. ఆయనకు బుద్ధి వచ్చేట్టు మేం చూస్తామని ప్రజలకు షర్మిల పిలుపునిచ్చారు. చింతమనేనికి టీడీపీ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని షర్మిల తప్పుబట్టారు. 

రౌడీ షీట్లు ఉన్న చింతమనేనికి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు షర్మిల. యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా చంద్రబాబు ఉన్నాడు కాబట్టే.. చింతమనేని ఇలా ఉన్నారని షర్మిల విమర్శించారు. చింతమనేని సొంత నియోజక వర్గంలో షర్మిల చింతమనేనిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: