ఫిబ్రవరి 3 నుండి మార్చి నెలాఖరు వరకు, రాస్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో మారుమూల పల్లెల్లో రూరల్ మీడియా టీమ్ నిర్వహించిన ఈ సర్వేలో ప్రజల స్సందన తెలుసుకునే ప్రయత్నం జరిగింది. మీ నియోజక వర్గంలో అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు అని అడిగితే, ఎక్కువ శాతం ఓటర్లు స్థానికంగా పోటీచేస్తున్న అభ్యర్థి గతంలో ప్రజా సమస్యలు పట్టించుకున్నారా? లేదా అని చూస్తామన్నారు. 


రాయల సీమ ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమని చెప్పారు . కోస్తాంధ్ర ప్రజలు అభ్యర్థుల పార్టీ గత చరిత్రచూస్తామన్నారు. ఈ కారణాలు ఇలా ఉంటే, పోలింగ్‌కి ముందు రోజు అభ్యర్థి పంచే డబ్బు,లిక్కర్‌, బహుమతులు కూడా ఓటర్ల పై ప్రభావం చూపుతాయని అధిక శాతం ప్రజలు ఒప్పుకున్నారు. 

ఎన్నికల ప్రచారంలో రెండు ప్రధాన పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న ప్రత్యేక హోదా అంశాన్ని ఓటర్లు పెద్దగా పట్టించుకోవడం లేదనేది ఈ సర్వేలో స్పష్టమైంది. ఆంధ్రవాళ్లను హైదరాబాద్‌లో కొడుతున్నారని జనసేన పదేపదే చేసిన ప్రచారానికి కూడా ప్రజలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 

ఇక జిల్లాల ఫలితాలు ఇలా.. 

శ్రీకాకుళం(10)            - టీడీపీ-04, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  06 
విజయనగరం(09)      -టీడీపీ-03, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 06 
విశాఖపట్టణం(15)      - టీడీపీ-06, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-08, జనసేన-01 
ఈస్ట్‌ గోదావరి(19)       - టీడీపీ-12, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 07 
వెస్ట్‌ గోదావరి(15)         - టీడీపీ-07, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 08 
కృష్ణా(16)                   - టీడీపీ-11, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 05 
గుంటూరు(17)           -టీడీపీ-10, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 07 
నెల్లూరు(10)               -టీడీపీ-03, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 07 
ప్రకాశం(12)                - టీడీపీ- 04, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ- 08 
కర్నూలు(14)               -టీడీపీ -01 , వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-13 
వైఎస్సార్‌ కడప(10)    -టీడీపీ -01, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-09 
అనంతపురం(14)         - టీడీపీ-04, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-10 
చిత్తూరు(14)               - టీడీపీ-06, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ-08 


లోక్‌ సభ సీట్లు.. 
సమయాభావం వల్ల పాతిక లోక్‌ సభ సీట్ల విషయంలో సర్వే చేయలేక పోయాం. చిత్తూరు, నెల్లూరు, కడప, అమలాపురంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెగ్గే అవకాశం ఉంది. 

ఈ అంచనాలన్నీసమగ్రమూ, సంపూర్ణం అని మేం చెప్పబోవడం లేదు. మేం స్వయంగా కలిసిన గ్రామీణులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్ధలు ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించి ఇచ్చిన సర్వే ఇది. అంతిమంగా ప్రజలు ఏం నిర్ణయిస్తారో అదే జరుగుతుంది. పోలింగ్‌ ముందు జరిగే ప్రలోభాలు, బ్యాంకుల్లో జమ అయ్యే పసుపుకుంకుమ,అన్నదాత సుఖీభవ డబ్బుల ప్రభావం కూడా ఈ ఫలితాల మీద ఉండే అవకాశం ఉందని రూరల్‌ మీడియా టీమ్ తెలిపింది.  లేదా.. ruralmedia.in వెబ్‌సైట్‌ చూడవచ్చు. https://ruralmedia.in/rural-media-opinion-poll/


మరింత సమాచారం తెలుసుకోండి: