వైసీపీ అధినేత ఇప్పటికే నవరత్నాల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చాడు. ఆ పథకాలు ప్రజల సంక్షేమానికి ఉపయోగపడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . అయితే సంక్షేమం అంటే డ్వాక్రా మహిళలకు మామూలుగా అందాల్సిన డబ్బునే పసుపు కుంకుమ పేరుతో  ఎన్నికల ముందు ఓట్ల కొనుగోలుకు వాడుకోవడం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నారు. పోలింగ్ కు ముందు రోజు జనాల ఖాతాల్లోకి డబ్బులు వేస్తే తప్ప తనకు ప్రజలు ఓటేయరనే భావనలో ఉన్నారాయన.


మరోవైపు జగన్ మాత్రం తనదైన రీతిలో సాగుతూ ఉన్నారు. పోలింగ్ కు అతి తక్కువ సమయం ఉండగా జగన్ ఒక ఆసక్తిదాయకమైన పథకంతో వచ్చారు. ఈ సారి మధ్యతరగతి కుటుంబాల కోసం ఆరోగ్య పథకాన్ని అనౌన్స్ చేశారు జగన్. రేషన్ కార్డులు ఉన్న వారు ఆరోగ్య శ్రీకి అర్హులు. అయితే పట్టణ మధ్య తరగతికి రేషన్ కార్డులు దాదాపుగా ఉండవు.అలాంటి వారి కోసం జగన్ యూనివర్సల్ హెల్త్ కార్డ్స్ ను ప్రకటించారు.


ఐదు లక్షల రూపాయల్లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యూనివర్సల్ హెల్త్ కార్డుల పరిధిలోకి వస్తారని జగన్ ప్రకటించారు. ఇలాంటి వారు కూడా ఆరోగ్యశ్రీ సేవలను ఉపయోగించుకోవచ్చని, అంటే వెయ్యి రూపాయలకు పైగా ఆసుపత్రి ఖర్చు అయ్యే సమయంలో ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలను ఉచితంగా పొందవచ్చని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాలో తనే ఈ పథకాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తానని జగన్ హామీ ఇచ్చారు. గుంటూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఈ హామీని ఇచ్చారు. పట్టణ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడేలా ఉంది ఈ హామీ.

మరింత సమాచారం తెలుసుకోండి: