ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీకి ఇవే ఆఖరు ఎన్నికలవుతాయంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన శుక్రవారం విజయవాడలో నడిరోడ్డుపై ధర్నా చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. అనంతరం విగ్రహం వద్ద ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులతో కలసి బైఠాయించారు.


ఈ నిరసనకు రాష్ట్రమంతా సంఘీభావం తెలపాలి.. ఒకరు పది మందికి చెప్పాలి. పది మంది వేయి మందికి చెప్పాలి.. రాష్ట్రమంతా అట్టుడికే పరిస్థితి రావాలి.. ఇలాగే కొనసాగితే.. తీవ్రపరిణామాలుంటాయి.. ఇవీ చంద్రబాబు నిరసన సందర్భంగా ఇవీ చంద్రబాబు చెప్పిన మాటలు.. 

ఇంకా ఏమన్నారంటే.. చెల్లని కాసులైన భాజపా, వైకాపా, తెరాసలను గంగలో కలపాలి. ఎన్నికల సమయంలో ఐటీ దాడులు చేయడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగలేదు. జగన్‌ తమకు మద్దతిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ స్వయంగా చెప్పారు. 

ఇటీవల 2 రోజులు జగన్‌ లోటస్‌పాండ్‌లో కూర్చుని కుట్రలు, కుతంత్రాలు చేశారు. ఇందులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారు అంటూ రెచ్చిపోయారు చంద్రబాబు. రాష్ట్రాన్ని అట్టుడికించాలంటూ చంద్రబాబు చెబుతున్న మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తెలుగుదేశం ఏమైనా కుట్రలకు పథక రచన చేస్తుందా అన్న అనుమానాలు వైకాపా నేతలు వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: