గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. డైనమైట్ల వంటి డైలాగులతో టీడీపీ నాయకులను చెడుగుడు ఆడుకుంటున్నారు. ప్రత్యేకించి చంద్రబాబు, లోకేశ్ లపై ఆయన వేస్తున్న సెటైర్లు బాగా పేలుతున్నాయి. 


నాని ప్రసంగాలకు జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్ పార్టీని లాక్కున్న చంద్రబాబుకు సొంత టాలెంట్ లేదన్నారు.  ఇటీవల తరచూ లోకేశ్ జగన్ గురించి కామెంట్ చేస్తున్నాడన్న నాని.. ఆ అర్హత లోకేశ్‌కు ఏమాత్రం లేదన్నారు. జగన్ తన తండ్రి చనిపోతే.. తండ్రిపేరుతో పార్టీ పెట్టుకుని జనంలోకి వెళ్లి వారి మద్దతు పొందాడని గుర్తు చేశారు. 

రేపు చంద్రబాబు చనిపోతే .. అప్పుడు లోకేశ్ సీబీఎన్‌ టీడీపీ అంటూ జనంలోకి వెళ్లి వారి ఆదరణ పొందగలడా.. అంత సత్తా ఉందా అని కొడాలి నాని నిలదీశారు. లోకేశ్ జగన్‌తో పోల్చుకుంటే చూసి భరించే పరిస్థితి ఆంధ్రాప్రజలకు లేదని నాని అన్నారు. లోకేశ్ వంటి దద్దమ్మను జనంపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. 

లోకేశ్‌కు వర్థంతికి, జయంతికీ తేడా తెలియదని.. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేస్తే మీ ఉరి మీరు వేసుకున్నట్టే అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మొత్తానికి లోకేశ్‌ ను కొడాలి నాని ఆడుకుంటున్న తీరు చూసి గుడివాడ ప్రజలు నవ్వుకుంటున్నారు. దీనికి తోడు పాపం.. లోకేశ్ కూడా ప్రతిరోజూ ఏదో ఒకచోట దొరికిపోతూ అభాసుపాలవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: