ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి.. జ్యోతిష్యంలో ఈయన ట్రాక్‌ రికార్డే వేరు.. ఉత్తరాదిలో వరదలు వంటి అనేక సంఘటనలను ఆయన ముందే చెప్పారు. ఆయన చెప్పిన వాటిలో నూటికి 99 శాతం కచ్చితంగా జరిగి తీరాల్సిందే. అంతటి రికార్డ్ ఆయన సొంతం. 


ఇప్పుడు ఆయన ఏపీలో జగన్ సీఎం కాబోతున్నారని తేల్చి చెప్పేశారు. జ్యోతిష్యంలో విశేష అనుభవం ఉన్న ములుగు రామలింగేశ్వర వరప్రసాదు వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి జాతకం ఎన్నికల ఫలితాలకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డి జాతకంలో శక్తిమంతమైన బ్రహ్మయోగం ఉందని ఆయన అన్నారు. 

జగన్‌ జన్మలగ్నం కన్యాలగ్నం అనీ, నక్షత్రం ఆరుద్ర అనీ, రాశి మిథునరాశి అనీ దరిమిలా ఆయన జాతకంలో ప్రబలమైనటువంటి గజకేసరి యోగం కూడా ఉందని ఆయన తెలిపారు. ఈ ఏప్రిల్ 30 తేదీతో జగన్‌కు  శనిమహర్దశ అయిపోయి, బుధమహర్దశ వస్తుందనీ ములుగు చెప్పారు.

మహర్దశనాథుడు లగ్నదశమాధిపతి అయిన బుధుడు అతిక్రాంత యోగాన్ని ఇవ్వటం వలన జాతకునికి విశేషరాజయోగం సంప్రాప్తిస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డ ఈ యువనాయకుడు తండ్రి పేరుని నిలబెడతాడనీ ఈ ఎన్నికలలో జగన్‌ మోహన్‌ రెడ్డి ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని ములుగు సిద్ధాంతి జోస్యం చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: