ముఖ్యమంత్రి.. జగన్ ఈ రెండూ పదాలు గత పదేళ్ళుగా అటు జనంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ బాగా నలుగుతున్నాయి. ఎంపీగా ఎన్నికై కేవలం మూడు నెలల వ్యవధిలోనే జగన్ తండ్రి, ఏపీ సీం వైఎస్సార్ హఠాత్తుగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దాంతో అప్పటి వరకూ రాజకీయ తెరకు పెద్దగా పరిచయం లేని జగన్ పేరు ఒక్కసారిగా సీఎం పోస్ట్ కు పరిశీలనకు వచ్చింది.

 

నిజానికి జగన్ సీఎం అవాల్సింది అపుడే. అంటే 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ చనిపోయిన వెనువెంటనే జగన్ కి ముఖ్యమంత్రి పీఠం కోసం మొత్తం ఏపీ కాంగ్రెస్ లో తెర వెనక గ్రౌండ్ ప్రిపేర్ ఐపొయింది. అయితే అప్పట్లో కేంద్రంలో బలంగా ఉంటూ రెండవమారు కూడా అధికారంలోకి వచ్చిన యూపీయే ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి ఉన్నారు. ఆమె మాత్రం జగన్ కి నో చెప్పేశారు. అంతే అక్కడే అగ్గి రాజుకుంది.

 

కాంగ్రెస్ లో జగన్ కొనసాగకపోవడానికి ఇదొక కారాణమైతే ఓదార్పు యాత్ర పేరిట జగన్ జనంలోకి రావడానికి కూడా సోనియా అంగీకరించలేదుట. పైగా పార్టీలో ఉంటూ తాను చెప్పినట్లుగా చేయాలని కట్టడి చేశారట. ఆలా కనుక చేస్తే ముందుగా కేంద్ర మంత్రిని చేసి తరువాత ముఖ్యమంత్రిని చేస్తామని కూడా కాంగ్రెస్ అధినేత్రి జగన్ కి హామీ ఇచ్చారట. అయితే తండ్రి చనిపోయిన ప్రదేశంలో జనాలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ కి రాజీనామా చేసి బయటకు రావాల్సివచ్చిందని జగన్ నాటి విషయానలు ఓ జాతీయ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.


తానే నాడు రాజీ పడి ఉంటే కేంద్ర మంత్రి పదవితో పాటు, ముఖ్యమంత్రిని కూడా ఎపుడో అయ్యేవాడినని జగన్ గతాన్ని నెమరువేసుకున్నారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి బయటకు వచ్చానని, బలమైన కాంగ్రెస్ సామ్రాజ్యం మీద పోరాటం చేశానని, ఎన్నో బాధలు గత పదేళ్ళలో ఎదుర్కొన్నానని జగన్ చెప్పుకొచ్చారు. తనకు జనంలో ఉండడం చాలా సంత్రుప్తిని ఇచ్చిందని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్న ఆనదం, సంత్రుప్తి తనలో ఉన్నాయని జగన్ అన్నారు. అంటే పదవులు కంటే మాట తనకు ముఖ్యమని జగన్ పదేళ్ళ తన పొలిటికల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చారన్న మాట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: