ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాడీవేడీ కొనసాగతుగుంది.  ఇప్పటికే అధినేతలు రంగంలోకి దిగి ముమ్మర ప్రచారంలో మునిగిపోయారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతూ తమదైన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.  చంద్రబాబు తాము ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వచ్చామని..వాటిని మునుముందు కొనసాగించాలంటే తమ పార్టీనే గెలిపించాలని అంటున్నారు. 


ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల మనసు దోచుకున్న వైఎస్ జగన్ తాను పరిపాలనలోకి వస్తే తన తండ్రి మాదిరిగానే  ప్రతి పేదవారి కళ్లలో ఆనందం చూసేలా అన్ని రకాలుగా సిద్దమవుతానని అంటున్నారు.  అంతే కాదు తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి యూనివర్శల్ హెల్త్ కార్డులను అందిస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రకటించారు.


గుంటూరులో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువగా ప్రజలకు సహాయాన్ని అందించే ఉద్దేశ్యంతో హెల్త్ కార్డుల స్కీమ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. కాాగా, ప్రతి నెల రూ. 40 వేల లోపు  ఆదాయం ఉన్న వారికి ఈ  ఈ స్కీమ్‌ను వర్తింపజేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: