పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఆయన అయిదేళ్ళ క్రితమే జనసేనను పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ యాక్టర్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన వారిలో ముఖ్యుడు. అంతకు ముందు అన్న నందమూరి, తరువాత చిరంజీవి వచ్చారు. వారికి ఎంతో గ్లామర్ జనంలో ఉంది. వారితో పోల్చితే పవన్ స్టైల్ భిన్నం.

 

నందమూరి తారక రామారావు పాటీ పెట్టినపుడు ఏపీ రాజకీయ మైదానం చాలా ఖాళీగా ఉంది. కాంగ్రెస్ అప్పటికే పరపతి పోగొట్టుకుని ఉంది. రామారావుకు అది బాగా ప్లస్ అయింది. దాంతో ఆయన వీర విజ్రుంభణ చేసి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక చిరంజీవి కాలం నాటికి వస్తే ఏపీలో కాంగ్రెస్, టీడీపీ రెండూ బలంగా ఉన్నాయి. అయినా అయన అతి విశ్వాసంతో 2008లో పార్టీ పెట్టి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. తన ప్రభావాన్ని బాగానే చూపించి నా రాజకీయ మైదానం ఖాళీ లేకపోవడం వల్లనే చిరంజీవి ఓడిపోవాల్సి వచ్చింది.


 

ఇపుడు పవన్ ఆ విషయాలను బాగా అధ్యయనం చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం టీడీపీ, వైసీపీ రెండూ బలంగా ఉన్నాయి. దాంతో ఆయన టీడీపీకి మద్దతుగా నిలిచి గెలిపించారు. అది పవన్ మార్క్ వ్యూహంలో భాగం. ఇక 2019 నాటికి టీడీపీ అధికారంలో ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో పోరాడుతోంది. ఇపుడు పవన్ పోటీలోకి దిగారు. ఈసారి రెండింటిలో ఓ పార్టీ అధికారంలోకి వస్తుంది. రెండవ పార్టీ ఓడిపోతే రాజకీయంగా పెను ఇబ్బందులు తప్పవు.


 

సరిగ్గా ఇక్కడే పవన్ తన మార్క్ పాలిట్రిక్స్ ప్లే చేస్తున్నారు.. ఆయనకు ఇపుడు హంగ్ రావాలి. వస్తే తనకు ఎక్కువ చాన్స్ ఉంటుంది. ఒకవేళ రాకపోయినా టీడీపీ గెలవాలి. ఇలా రెండు టార్గెట్స్ పెట్టుకుని పవన్ కూటమి కట్టి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే రాజకీయం గా తనకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నారు. జగన్ యువనేత. ఒకమారు అధికారంలోకి వస్తే ఆయన మరిన్ని సార్లు గెలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు.

 


అదే టీడీపీ వస్తే బాబు మళ్ళీ సీఎం అవుతారు. వైసీపీని ఆయనే వానిష్ చేస్తారు. దాంతో ప్రధాన ప్రతిపక్షం గా జనసేనకు చాన్స్ ఉంటుంది. అపుడు 2024 నాటికి తాను బరిలోకి నిలిచి పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావచ్చు. ఇదీ పవన్ మార్క్ స్ట్రాటజీ అని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. అంటే పక్కా ప్లాన్ తోనే ఈసారి పవన్ బరిలో ఉన్నారన్న మాట. ఓ విధంగా చూస్తే పవన్ రాజకీయంగా ముదురేనని సెటైర్లు పడుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: