ప్రజలతో నేరుగా మమేకం అయ్యే విధానాన్ని మొదటి నుండి కొనసాగిస్తున్న వైఎస్సార్సీపీ...జగనన్న కానుక కార్యక్రమం ద్వారా 80 లక్షల గృహాలకు నేరుగా చేరుకోనుంది.   రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మార్చి 24 న జగనన్న కానుక కార్యక్రమాన్ని ప్రారంభించింది.  ఇందులో భాగంగా వైసీపీ నాయకులు గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ, నవరత్నాలు పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందనున్నారో వివరిస్తున్నారు. జగనన్న కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిజ.. బూత్ కన్వీనర్లు, వాలంటీర్లతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహిస్తారు. 


అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు, పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలను సైతం నేరుగా కలుసుకునే పద్దతిని మొదటి నుండి వైసీపీ ఫాలో అవుతోంది. 14 నెలల పాటు జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో , దాదాపు 2 కోట్ల మంది ప్రజలతో నేరుగా మమేకమై ప్రజా సమస్యలపై చర్చించారు వైఎస్ జగన్. పాదయాత్ర తరువాత వైఎస్సార్ సీపీ జగనన్న పిలుపు, సమర శంఖారావం కార్యక్రమాలు నిర్వహించింది.

జగనన్న పిలుపు ద్వారా గ్రామాల్లో ఉన్న తటస్థులతో సమావేశమైన జగన్ వివిధ అంశాలపై చర్చించి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి తటస్థుల నుండి వినతులు, సలహాలు స్వీకరించారు. సమర శంఖారావం కార్యక్రమం ద్వారా వైసీపీ బూత్ స్థాయి కార్యకర్తలతో జగన్ సమావేశమై, వారి ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పి, వివిధ అంశాలపై సలహాలు స్వీకరించారు. 


జగనన్న కానుక కార్యక్రమం ద్వారా..రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా, భారీ స్థాయిలో గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, ఇద్దరు  లేదా ముగ్గురు కలిసి  బృందాలుగా ఏర్పడి..ఆయా బూత్ లలో  గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటిలో, నవరత్నాలు పథకాల గురించి , ఆయా పథకాలు ద్వారా ఇంటిలోని ప్రతి వ్యక్తి ఏ విధంగా లబ్ది పొందనున్నారో వివరిస్తున్నారు.

జగనన్న కానుక కార్యక్రమం ద్వారా ఒక్కో వైసీపీ అభ్యర్థి ఆయా నియోజకర్గాల్లో 45,000 ఇండ్లలో గడప గడపకు ప్రచారం నిర్వహించి..జగనన్నకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరనున్నారు.


దీనిపై వైసీపీ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ, ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలాన్ని ఇతర పార్టీల కంటే మెరుగ్గా ఉండేలా చేయగలిగామన్నారు.

జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, క్షేత్ర స్థయిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు...ఏప్రిల్ 11 న జరగనున్న ఎన్నికల్లో వైసీపీ కి సానుకూల ఫలితాలు ఇవ్వనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: