ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. మొన్న కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ నేను జైలుకు పోకుండా ఉండాలంటే మీరు నన్ను గెలిపించాలి అంటూ ప్రజలను కోరారు..ఇదే క్రమంలో ఇటీవల విశాఖపట్నం కంచరపాలం లో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో సీఎస్ పునేఠా బదిలీకి సంబంధించిన సమాచారం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు.


ఈ క్రమంలో తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అంటూ సందేహం వెలిబుచ్చారు. ఇదంతా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న కక్షసాధింపు చర్యలు అంటూ మోడీ పై విమర్శల వర్షం కురిపించారు చంద్రబాబు. అంతేకాకుండా ఇలాంటి వారిని నా రాజకీయ జీవితంలో చాలామందిని చూశాను అని నాపై బాంబులు వేసిన భయపడలేదని బెదిరింపులకు దిగిన రౌడీలకు ఎక్కడా కూడా వెన్ను చూపలేదని మాట్లాడుతూ...


మోడీ పై కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ఏమీ చేయకుండా చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు...అయినా తప్పు చేయకపోతే చంద్రబాబుకు అరెస్టు భయం ఎందుకని మరికొంతమంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: