ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌ను తెరుస్తామని, చేనేత కుటుంబాలకు నవరత్నాలతో పాటు రూ. 24వేలు ఇస్తామని, శనగ రైతులకు గిట్టుబాటు ధరల కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలను విన్నాను. బాధలను చూశాను. ప్రభుత్వ సాయం అందక ఇబ్బంది పడుతున్నా ప్రతి పేదవాడికి చెబుతున్నా మీ అందరికీ నేనన్నానే భరోసా ఇస్తున్నా.

గిట్టుబాటు ధరలేక రైతులు పడ్డ కష్టాలు చూశాను. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు నేను విన్నాను అంటూ జగన్ ప్రసంగించారు.మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ 9 అమ్ముడుపోయిన చానెళ్లన్నిటీతో చేయాలి.  ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు.

ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి అని వైఎస్‌ జగన్‌ కోరారు.అగ్రిగోల్డ్‌, కేశవరెడ్డి బాధితలను ఆదుకుంటామన్నారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.సుధీర్‌రెడ్డి‌‌‌, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌ రెడ్డిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: