కడప జిల్లా ప్రొద్దటూరు నియోజకవర్గం లో ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. గెలుపోటముల చర్చ పతాకస్థాయికి చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే స్థానానికి బరిలోకి దిగుతున్న అభ్యర్థులు టీడీపీ నుంచి లింగారెడ్డి, వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జనసేన నుంచి ఇంజ సోమశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొవ్వూరు బాలచంద్రా రెడ్డి అలాగే బీజేపీ నుంచి గొర్రె శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు.

ప్రధాన పోటీ : ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. అవి టీడీపీ మరియు వైసీపీ. ఇరు పార్టీలు ఇక్కడి బలమైనవే. టీడీపీ పార్టీ నుంచి పలుమార్లు ఇక్కడ ఆధిపత్యం చెలాయించారు. గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతూ వైసీపీ అధికారం లోకి వచ్చింది.

సానుకూలతలు : ప్రజలు వైసీపీకి వైపు మొగ్గచూపుతున్నారు అంటూ కొన్ని సర్వేలు వెలువడ్డాయి. జగన్ సొంత జిల్లా కావడంతో మేలుజరుగుతుంది అని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అవ్వడం కూడా ఒక ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. అయితే టీడీపీ పార్టీ నాయకుడు లింగారెడ్డి కి పల్లెలో మంచి పేరు ఉందని, అక్కడి ఓట్లు దాదాపు ఇతడికే పడతాయని అంటున్నారు.

పట్టణ అభివృధి : ప్రజలు ఎవరు ఎమ్మెల్యే అయిన అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. ఈసారి ప్రజలు మార్పు కోరుకోని లింగ రెడ్డి గెలిచిన ఆశ్చర్య పోనాక్కర్లేదు. పట్టణంలో ప్రధానంగా డ్రైనేజ్ సమస్య మరియు తాగునీటి సమస్య తో అల్లాడుతున్నారు. వీటి పై దృష్టి పెట్టిన వారికి ప్రజలు పట్టం కట్టవచ్చు.

గెలుపెవరిది ? : ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమైన పనే. టఫ్ ఫైట్ నడుస్తున్న ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యం మాత్రం వైసీపీ పార్టీ నేత రాచమల్లు శివప్రసాద్ దే అని చెప్పవచ్చు. ఆయన చేసిన అభివృద్ధి పక్కన పెడితే జగన్ సొంత జిల్లా అవ్వడం అతడికి కలిసి వచ్చే విషయం. జగన్ సీఎం అయితే ప్రొద్దుటూరు అభివృద్ధిలోకి వస్తుందని, గత ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీది కాబట్టి పట్టణ అభివృద్ధి నత్త నడకన సాగింది అంటున్నారు. అలాగే టీడీపీ నాయకుడు లింగ రెడ్డి పరిస్థితి వర్గ పోరు తో సతమతమవుతున్నట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: