తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికల్లో దాదాపు ఆరువందలకు పైగా హామీలు ఇవ్వడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిలో ఒకటైన నెరవేర్చార అని ప్రజలను ప్రశ్నలు వేస్తే చాలావరకు చంద్రబాబు గారు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదని ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో 2014 ఎన్నికల్లో చంద్రబాబును నమ్మి ఓటు వేసి మోసపోయినవారు కామెంట్స్ చేస్తున్నారు.


అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాష్ట్రమంతా పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ దారుణంగా ప్రజల ముందే గత ఎన్నికల కంటే అధికంగా 50 శాతం అభివృద్ధి చేశామని అన్ని హామీలు నెరవేర్చమని ప్రసంగాలలో చంద్రబాబు కళ్లార్పకుండా చెప్పడంతో ప్రజలంతా నవ్వుతున్నారు.


ఇంటికో ఉద్యోగం అలాగే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇచ్చిన హామీల విషయంలో 2014 ఎన్నికల్లో చెప్పిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు 2019 ఎన్నికలకు తమని మోసం చేయడానికి మళ్లీ వచ్చారంటూ బాబు గారు అసలు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సగం హామీలు కాదు కదా చాలావరకు ఇచ్చిన హామీలు ఏవీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఇప్పుడు వచ్చి మొత్తం హామీలు నెరవేర్చడం జరిగిందని చెబితే నమ్మే ప్రజలు ఆంధ్రాలో లేరని తెలంగాణలో ఏ విధంగా ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పారో ఆ విధంగా రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నాము ఈసారి చంద్రబాబు చెప్పే హామీలను ఎవరు నమ్మరు అంటూ ఏపీ ప్రజానీకం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్లకు కౌంటర్లు వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: