కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వైయస్ కుటుంబీకుల కంచుకోట అని తెలిసిన విషయమే. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం నుండి పోటీచేసి మళ్లీ గెలుపొందడం ఖాయమని చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో లో ఒక్కసారి కూడా టీడీపీ తమ జెండాను ఎగుర వేయలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టీపీడీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం కల్ల.  

అభ్యర్థులు : వైసీపీ పార్టీ నుంచి జగన్ పోటీ చేస్తున్నారు, టీడీపీ పార్టీ నుంచి సతీష్ రెడ్డి అలాగే జనసేన నుంచి తుపాకుల చంద్ర శేఖర్ పోటీ లో ఉండగా అటు బీజేపీ మరియు కాంగ్రెస్ నుంచి ఏ అభ్యర్థి పోటీలో లేకపోవడం గమనార్హం.

జగన్ మేనియా : ఇక్కడ జగన్ కు ఎలాంటి అభిమానం ముందు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ కుటుంబానికి ఈ ప్రాంతంలో ఎంతో ఆదరణ ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి పులివెందులను అభివృధి పథం లో నడిపారు. అలాగే జగన్ మీద నమ్మకంతో ఉన్నారు ఇక్కడి ప్రజలు.

ఇతర పార్టీల ప్రభావం :ఇక్కడ ఇతర పార్టీల ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి, టీడీపీ పార్టీ తరుపున సతీష్ రెడ్డి పోటీలో ఉన్నారు. స్వతహాగా ఇయనకు మంచి పేరున్న వైఎస్ గాలిలొ వీరి హవా పెద్దగా లేకపోవచ్చు. అటు జనసేన పార్టీ నుంచి కూడా పోటీ పేలవంగానే ఉంది. ఎంత కాదనుకున్నా సొంత ఊరీ వాడు అనే ఆలోచనతో అయిన ఓట్లు వైసీపీ కి పడుతాయి.పులివెందుల అభివృధి బాగానే జరుగుతుంది అని చెప్పాలి, కాకపోతే జగన్ పార్టీ అధ్యక్షుడు కావడం తో ప్రాంతానికి దూరంగా ప్రజలతో కలిసి ఉండడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పులివెందుల లో వైయస్ కుటుంబానికి పోటీగా నిలవడానికి ఎంతటి మహా నేతలు నేతలు వచ్చిన నిలువ లేరన్నది అందరి నోటిలో నానెే మాటే. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఈ ప్రాంతంలో లో గెలవాలని కోవడం చాలా కష్టతరమైన  విషయం. చాలా వరకు ఇక్కడి పోరు ఏకపక్షంగానే సాగుతుందని అందరూ అనుకుంటున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ నియోజకవర్గంపై పెద్దగా ఆసక్తి చూపరు. మొత్తానికి ఇక్కడ విజయం వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనని అందరి అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: