హిందూపూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదు. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం వ్యతిరేక పవనాలు పసుపు పార్టీకి గట్టిగానే వీస్తున్నాయి. వైసీపీ పార్టీ నుంచి ఇక్బాల్ అహ్మెద్ ఇప్పుడు ప్రముఖ సినీ నటుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే బాల కృష్ణ ను సవాలు చేస్తున్నాడు. 

పార్టీ అభ్యర్థులు : టీడీపీ పార్టీ నుంచి బాలకృష్ణ నిలపడుతున్నటు మనకు తెలిసిందే, వైసీపీ నుంచి ఇక్బాల్ అహ్మెద్ పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి ఆకుల రమేశ్ పోటీ చేయగా ఎటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పోటీ కి దూరంగా ఉన్నారు.

బాలకృష్ణకు అసమ్మతి సెగ : 1996 లో నందమూరి హరికృష్ణ కూడా ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారు. సూటిగా మాట్లాడాలంటే బాలయ్య తన పరిస్థితిని తనకు తానుగా క్లిష్టతరం చేసుకున్నాడు. సినిమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించి తన నియోజకవర్గపు ప్రజలను అసలు పట్టించుకోలేదు అనే అపవాదు మూటగట్టుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ వైఫల్యం మరియు బాలయ్య ఫన్నీ స్పీచ్ ల ప్రభావం అతని ఓటు బ్యాంకు పైన పడుతుందని విశ్లేషకుల అంచనా.

ఇక్బాల్ ప్రతికూలతలు : వ్యక్తిగతంగా ఎంతో అభివృద్ధిపరిచిన వ్యక్తిగా అబ్దుల్ ఘని కి ఇక్కడ చాలా మంచి పేరు ఉండడం బాలకృష్ణకు మరొక ప్రతికూల అంశం. అయితే బాలయ్య ఎప్పుడూ చాలా గొప్పగా ప్రస్తావించే తమ చరిత్రను నిలబెట్టుకుంటాడో లేక దాన్ని మార్చేందుకు వైసీపీకి అవకాశం ఇస్తాడో వేచి చూడాలి.

ప్రజల నాడి : తాజాగా ఈ మధ్య కొన్ని సర్వేలు వెల్లువడ్డాయి, అందులో టీడీపీ అవకాశాలు సజీవంగానే ఉన్నాయట, వైసీపీ పార్టీకి మద్దతుదారులు ఉన్నా, చాలా మంది ఇంకా టీడీపీ వైపే ఉన్నారంటూ అంటున్నారు. మిగతా పార్టీల ప్రభావం పెద్దగా బలంగా లేదాట. టీడీపీ కి అప్పటి కాలం నాటి సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అవుతుంది.

గెలుపెవరిది? : టీడీపీ పవనాలు గట్టిగా వీస్తున్న, అటు వైసీపీ నుంచి వచ్చే గాలి కూడా అదే స్థాయిలో వేస్తుందని సమాచారం. ప్రజలు ఎటి వైపు ఉన్నారో చెప్పడం కష్టం కానీ, కొంత మేర టీడీపీ కి మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇక ఇతర పార్టీల హవా అసలు కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: