Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 6:38 pm IST

Menu &Sections

Search

టిడిపి మేనిఫెస్టో విడుదల.., బాబుని నమ్మే రోజులు పోయాయి అంటున్న వైసిపి..!

టిడిపి మేనిఫెస్టో విడుదల.., బాబుని నమ్మే రోజులు పోయాయి అంటున్న వైసిపి..!
టిడిపి మేనిఫెస్టో విడుదల.., బాబుని నమ్మే రోజులు పోయాయి అంటున్న వైసిపి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా ఉగాది పర్వదినం నాడు టిడిపి పార్టీ తరఫున ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే పలు ప్రచార సభలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు తాజాగా మేనిఫెస్టోలో కొత్త కొత్త హామీలు ప్రకటించారు. ముఖ్యంగా మీ భవిష్యత్తు నా బాధ్యత అనే నినాదంతో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో విజయమే టార్గెట్ గా పెట్టుకుని ప్రజలకు ఊహించని విధంగా హామీలు ఇవ్వడంతో ఏపీ ప్రజలు చంద్రబాబు ఇచ్చిన హామీలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మరియు రాబోయే ఎన్నికల్లో గెలిస్తే చేసే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేసే విధంగా మ్యానిఫెస్టో రూపొందించారు. ముఖ్యంగా ఇటీవల ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను చూపుతూ ప్రజలకు 2019 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

 • రూ.5 వేల కోట్లతో పంటల ధరల స్థిరీకరణకు ఫండ్

 • ఏటా అన్నదాత సుఖీభవ పథకం అమలు

 • రైతులకు వడ్డీ లేకుండా రుణాలు

 • కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ డెవలప్‌మెంట్

 • ప్రతి మండల, పట్టణ కేంద్రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు

 • డ్వాక్రా మహిళలకు ఉచితంగా సెల్‌ఫోన్లు

 • చంద్రన్న బీమా రూ5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు

 • సాగుకు 12 గంటల ఉచిత విద్యుత్ సరఫరా

 • పెన్షన్ రూ.3 వేలకు పెంపు, 60 ఏళ్లకే పెన్షన్లు

 • నిరుద్యోగ భృతి రూ.3వేలకు పెంపు.

 • ఇంటర్‌ పాసైతే చాలు నిరుద్యోగ భృతి

 • విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు

 • మాదిగలు, రెల్లి, యానాది కులాలకు ప్రత్యేకంగా కార్పోరేషన్ల ఏర్పాటు

 • ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్లు సరఫరాకు ప్రత్యేక చర్యలు

 • గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడి రాయితీలు

 • 40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరింపు

 • మరో 50 లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్పింక్లర్‌ వ్యవస్థల ఏర్పాటు

 • కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు

 • యువత కోసం ఏటా ఉద్యోగాల భర్తీ

 • ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తాం.

 • రైతులకు లాభసాటి ధరలు లభించేలా వ్యవసాయ మార్కెట్‌ వ్యవస్థల బలోపేతం

 • ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్ల సరఫరాకు ప్రత్యేక చర్యలు.

 • కేంద్రంతో పోరాడి వ్యవసాయంతో నరేగా అనుసంధానం

 • ఆదివాసుల కోసం ప్రత్యేక బ్యాంక్‌

 • సముద్రంలో వేటకు వెళ్లేవారికి క్రాప్‌ హాలిడే కింద రూ.పది వేలు

 • చంద్రన్నబీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

 • పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు

 • 20 వేల జనాభా దాటిన మేజర్‌ పంచాయతీలకు అన్నా క్యాంటీన్లు

 • పేద కుటుంబాలకు పండుగల సందర్భంగా ఉచితంగా రెండు గ్యాస్‌ సిలిండర్లు

 • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పదేళ్లు కొనసాగింపు.

 • కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు విదేశీ విద్య కోసం రూ.25 లక్షల ఆర్థిక సాయం.

 • ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ

 • రూ.10 వేల కోట్లతో బీసీల కోసం ప్రత్యేక బ్యాంకు. బీసీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత

 • ఏపీఐఐసీ ప్లాట్లలో 25 శాతం బీసీలకు రిజర్వేషన్‌

 • స్వయం ఉపాధిలో భాగంగా కార్ల కొనుగోలుకు 25 శాతం రాయితీ.

 • 200 రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటు

 • ప్రతి కుటుంబానికి రూ.20 వేలు ఆదాయం కల్పించేలా చర్యలు

 • డ్వాక్రా మహిళలకు పసుపు - కుంకుమ పథకం కొనసాగింపు, ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు

 • ఉద్యోగినులకు టూవీలర్ల కొనుగోలుకు రాయితీలు

 • వడ్డెర, బ్రాహ్మణ కులాలకు ఎమ్మెల్సీ

 • చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా ఉచితం. మార్కెటింగ్‌ నిధి రూ.250 కోట్లు.

 • మంగళగిరిలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు

 • చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి

 • ఏపీని పోషకాహార లోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

 • అంగన్‌వా కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం. ప్రీ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం

 • మత్స్యకారులకు క్రాప్‌ హాలిడే కింద రూ.10కు పెంపు. డీజిల్‌ ప్రోత్సాహకం రూ.10కి పెంపు.

అయితే తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పై వైసీపీ పార్టీకి చెందిన నాయకులు మండిపడుతున్నారు. జగన్ పాదయాత్రలో ప్రకటించిన హామీలను కాపీ కొడుతూ అధికారమే లక్ష్యంగా చంద్రబాబు మేనిఫెస్టో రూపొందించారని గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ నుండి తొలగించారని అప్పుడే అమలుచేయలేని హామీలు ఇప్పుడు ఈ విధమైన హామీలు ఇవ్వడం హాస్యాస్పదమని...చంద్రబాబుని నమ్మే రోజులు ఏపీలో లేవని కామెంట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు.


ap-election-2019-andhra-pradesh-politics-andhra-po
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న బిగ్ బాస్ సీజన్ 3…!
అభిమాని కోరిక నెరవేర్చిన మెగాస్టార్ చిరంజీవి..!
ఎన్టీఆర్ పై నందమూరి అభిమానులు సీరియస్!
మన్మధుడు 2 సినిమాలో హీరోయిన్ పై సీరియస్ అయిన నాగార్జున..?
నానీ జెర్సీ కలక్షన్ లకి అడ్డం పడుతోంది ఎవరు ?
బన్ని చెప్పిన ఆ మాటతో .. ఇదెక్కడి గొడవ రా బాబూ అంటోన్న సుకుమార్
మహేష్ కల్లో కూడా మర్చిపోలేని అట్టర్ ప్లాప్ సినిమా ని రీమేక్ చేస్తున్నారు !
చిరంజీవి ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్ - సైరా కంటే పెద్ద సినిమా ?
రామ్ చరణ్ - ఎన్టీఆర్ లకి బ్యాడ్ న్యూస్ ?
కెసిఆర్ బయోపిక్ లో చంద్రబాబు విలన్ ?
చరణ్ - బన్నీ మల్టీ స్టారర్ ?
ఒక్కసారి కాదు రెండు సార్లు చూశా..ఎన్టీఆర్!
జెర్సీ డైరెక్టర్ కి అల్లూ అర్జున్ ఫోన్ ?
About the author

Kranthi is an independent writer and campaigner.