ఉగాది పర్వదినం నాడు వైసీపీ అధినేత జగన్ తన పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చేయగలిగింది మాత్రమే చెప్పే ధైర్యం ఉందని మనసా వాచా కర్మణా అంతఃకరణ శుద్ధితో మేనిఫెస్టో లో ఉన్న ప్రతి అంశాన్ని నెరవేర్చగల సత్తా ఉన్న అంశాలనే పొందుపరిచామని లేనిది చెప్పలేనిది ఏనాడు నా జీవితంలో చెప్పలేదంటూ రాబోయే ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఏవైతే మేనిఫెస్టోలో రూపొందించడం జరిగిందో వాటిని అమలు చేశాకే వచ్చే ఎన్నికల ఓట్లను అడుగుతానని అన్నారు జగన్.


ముఖ్యంగా తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు భారీ ఎత్తున హామీలను ప్రకటించారు. రెండున్నర ఎకరాలు లోపు ఉన్న ప్రతీ రైతుకు మే నెలలో పంట వేసేసమయానికి అంటే మే నెలలో సంవత్సరానికి రూ.12,500 రూపాయలు నేరుగా అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.12,500లను నేరుగా రైతు చేతుల్లోనే పెడతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా రైతులకు ఉచిత బోర్లు వేస్తున్నట్లు పగటిపూట ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇవ్వబోతున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మరియు ముఖ్యంగా బీసీ వర్గానికి అన్ని విధాల ఆర్థికంగాను మరియు వివాహ సమయంలోనూ వైసిపి ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు జగన్.


గతంలో తెలుగుదేశం పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను ఓటుబ్యాంకుగా చూసిన క్రమంలో కాకుండా జగన్ వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా బీసీ లో ఉన్న అన్ని కులాలకు అద్భుతమైన హామీలు ప్రకటించారు, మరియు ముఖ్యంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు మరియు ప్రతి గ్రామంలోను గ్రామ సచివాలయం ఏర్పాటుచేసి ఆ గ్రామానికి చెందిన వారికే ఉద్యోగాలు ఇస్తున్నట్లు రాబోయే వైసిపి పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేలా అనేక హామీలు ప్రకటించారు జగన్.


ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించిన జగన్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి సంతకం పెడుతుందో ఆ పార్టీకి మాత్రమే మద్దతు తెలపడం జరుగుతుందని ప్రత్యేక హోదా అన్నది ఏపీ యొక్క హక్కు అని కచ్చితంగా సాధించి తీరుతామని జగన్ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: