వైసీపీ అధినేత జగన్ నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ విన్నవీ, కన్నవీ రెండూ కూడా తన ఎన్నికల ప్రణాళికలో చక్కగా పెట్టారు. తాను తీర ప్రాంతాలలో పర్యటిస్తున్నపుడు మత్యకారుల గోడు స్వయంగా విన్నారు. వారి బాధలన్నీ కళ్ళతో చూశారు. ఆనాడే ఆయన వారికి కొన్ని హామీలు ఇచ్చారు. అవి ఎక్కడా గాలికి కొట్టుకుపోలేదు.

 

సరిగ్గా ఎన్నికల ప్రణాళిక రోజున వాటిని తీసుకువచ్చి గుదిగుచ్చినట్లుగా ఒక్కోటీ పెట్టారు వాటిని చూసిన తరువాత జగన్ మీద మొదటి నమ్మకం అయితే కలిగింది. ఆయన గాలి కబుర్లు చెప్పడని, చూసినది, విన్నదీ రెండూ కలసి ఆయన నోటి వెంట కచ్చితమైన హామీగా వస్తుందని, రేపటి రోజున అదే హామీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఆచరణకు నోచుకుంటుందని కూడా జగన్ చాటి చెప్పగలిగారు.

 


అందుకు అచ్చమైన ఉదాహరణగా మత్యకారులకు కొత్త పడవలు, దానికి సంబంధించి జగన్ ఆనాడే గొప్ప వరం ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే తప్పకుండా మత్యకారులను ఆదుకుంటాను, వారు కొత్త పడవలు కొనుక్కోవడానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తాను, ఇక మర పడవలకు సంబ్సిడీ మీద డీజిల్ ఆయిల్ కూడా సరఫరా చేస్తామని జగన్ చెప్పారు. అదిపుడు ఎన్నికల హామీగా వచ్చింది. అంటే జగన్ మనసులో ఆ హామీ ఎక్కడా చెక్కుచెదరలేదని తెలుస్తోంది.

రేపటి రోజున అధికారంలోకి కనుక జగన్ వస్తే ఆ హామీ అమలు అమలవుతుంది.. దీంతో ఏపీలోని తీర ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది జిల్లాలకు చెందిన మత్య్సకారులంతా ఈ హామీ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ హామీ ఇచ్చారంటే తప్పకుండా చేస్తారని కూడా వారు బలంగా నమ్ము తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: