తిరుమల శ్రీవారి ఆలయానికి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఆ స్వామి అందరి వాడు. ఆయన కలియుగ అవతారం. ఆయన్ని కొలుచుకునేందుకు అన్ని వర్గాలు, వర్ణాల వారిని కరుణించి ఆదరించిన మహనీయుడు ఆ స్వామి. అటువంటి స్వామి కలియుగంలో అవతరించిన తరువాత అందరినీ తన సన్నిధికి చేర్చుకున్నారు.

 

అయితే స్వామి వారి సేవలు, సంప్రదాయాల మీద కూడా పెత్తనం చేసే సంస్థలు ఆవిర్భావం తరువాత కొన్ని సంప్రదాయాలకు కాలం చెల్లిందన్నారు. దాని మీద ఆయా సామాజిక వర్గాలు ఎంత మొత్తుకున్నా పట్టించుకున్న నాధుడే లేకుండా పోయారు. ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత జగన్ యాదవ సామాజిక వర్గానికి వరంగా ఎన్నికల ప్రణాళికలో గొల్ల్లలకు అవకాశం ఇచ్చే సంప్రదాయన్ని తిరిగి పునరుధ్ధరిస్తామని ప్రకటించారు.

 

శ్రీనివాసుని సన్నిధిని తెరిపించే ఆ అవకాశం, అద్రుష్టం నాడు వరంగా ఆ దేవదేవుని నుంచి గొల్లలు పొందారు. ఆటువంటి సంప్రదాయాన్ని తిరిగి పునరుధ్ధరించడం అంటే అది కచ్చితంగా వారికి స్వామికి చెంతన నిలిచి సేవ చేసుకున్నట్లే అవుతుంది. మరి తమ డిమాండ్ ని పొందుపరచి ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టిన జగన్ కి ఆ కులస్థులు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: