ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ప్రస్తుతం సీఎస్‌గా పనిచేస్తున్న అనిల్‌చంద్ర పునేఠాను ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖకు బదిలీచేయాలని ఆదేశించింది.  అయితే, ఈ మార్పుపై సీఎం చంద్రబాబు స్పందన ఆసక్తికరంగా మారింది.


1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం యువజన, క్రీడల సర్వీసుల శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే, ఆయన సీనియార్టీకి తగిన గౌరవం దక్కలేదనే భావన ఉంది. మరోవైపు ఎల్వీ ఇప్పటి వరకు సెలవులో ఉన్నారు. తాజాగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో సుబ్రహ్మణ్యం హైదరాబాద్ వాటర్ బోర్డులో పనిచేశారు.

 

కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా బదిలీ, కొత్త సీఎస్ నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ఏ తప్పూ చేయని సీఎస్‌ను బదిలీ చేశారని మండిపడ్డారు. ఇవాళ సీఎస్‌ను, మొన్న డీజీని బదిలీ చేశారని.. ఏ తప్పు చేశారో కూడా చెప్పలదేని మండిపడ్డారు. తనను వేధిస్తున్నారన్న చంద్రబాబు.. రేపో మాపో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. జైలుకైనా వెళ్తానని.. కానీ మోడీకి మాత్రం భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను ఏకాకిని చేని దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: