నందమూరి వంశం నుండి రాజకీయ వారసుడుగా మిగిలి ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన వారసులు పెద్దల్లుడు నారా లోకెష్ మరియు చిన్నల్లుడు శ్రీభరత్ ను రాజకీయాల్లోకి తెచ్చారు. పెద్దల్లుడు లోకెష్ స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు. కాబట్టి అక్కడ బాలకృష్ణకు వచ్చే ఇబ్బందేమీ లేదు. ఇక రెండో అల్లుడు సైతం వైజాగ్ టిడిపి మాజీ ఎంపి దివంగత ఎంవివిఎస్ మూర్తి గారి మనవడే కాదు ప్రముఖ పారిశ్రామిక వేత్త కావూరి సాంబశివరావు మనవడు కూడా.  
sribharat & Balakrishna  కోసం చిత్ర ఫలితం
అయితే ఈ సినీనటుడు, హిందూపురం తెలుగుదేశం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తన చిన్నల్లుడి గెలుపు కోసం తానే స్వయంగా రంగంలోకి దిగారు. కొద్ది రోజులుగా తన సొంత నియోజకవర్గమైన హిందూపురానికి మాత్రమే పరిమితమైన బాలకృష్ణ, ఎన్నికల ప్రచారం తుది ఘడియలు దగ్గరపడుతున్న తరుణంలో విశాఖకు వచ్చారు. విశాఖలోని భీమలి సహా పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన బాలకృష్ణ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు తన చిన్న్ల్లుడు శ్రీభరత్‌ ను గెలిపించాలని కోరారు. 
విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తన చిన్నల్లుడు శ్రీభరత్‌ కు పట్టుబట్టి టికెట్ సాధించుకున్న నందమూరి బాలకృష్ణ, చాలా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. 
sri bharat & Balakrishna కోసం చిత్ర ఫలితం
నిజానికి హిందూపుంలో ఈ సారి బాలకృష్ణ వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు ఆయన భార్య వసుంధర కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శ్రీభరత్ తరపున ప్రచారానికి విశాఖకు రాకపోవచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే విశాఖలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీభరత్‌కు జనసేన అభ్యర్థి మాజీ సిబీఐ జేడీ వివి లక్ష్మీనారాయణతో పాటు వైసీపీ అభ్యర్థి నుంచి కూడా గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. 
sri bharat & Balakrishna కోసం చిత్ర ఫలితం
ఈ నేపథ్యంలో భరత్ తరపున కనీసం రెండు రోజులైనా ప్రచారం చేయాలని భావించిన బాలకృష్ణ విశాఖ ప్రచార బరిలో దిగారు. భరత్ గెలుపుకోసం విశాఖలోని తన అభిమానులతోనూ ఆయన సమావేశమయ్యారని తెలుస్తోంది. మొత్తానికి చిన్నల్లుడిని గెలిపించుకోవడానికి విశాఖ వచ్చిన బాలకృష్ణ, భరత్‌ను గెలిపిస్తారా? అన్నది ప్రస్తుతానికి ఎన్నికలు జరిగి, పహలితాలు వచ్చేవరకు మనం నిరీక్షించ వాల్సిందే.
  

మరింత సమాచారం తెలుసుకోండి: