ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయంగా గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షం వైకాపా గట్టి పోటీ ఇస్తోంది. మరోవైపు కేంద్రం సహకరించడం లేదు. ఈసీ కూడా పగబట్టినట్టు వ్యవహరిస్తున్నట్టు ఆయన వాపోతున్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నుంచే టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ రెయిడ్స్ జరిగాయి. 


ఈ దాడులపై ఏపీ సీఎం ఎన్నికల  ప్రచారంలో విచిత్రంగా స్పందించారు. తమ్ముళ్లూ.. ఈ ఎన్నికల్లో పది రూపాయలు ఖర్చు పెడదామనుకుంటే.. ఆదాయపన్ను దాడులు చేసి ఆ ప్రయత్నం విఫలం చేశారు. మీకు ఓ ఐదు రూపాయలు ఇద్దామంటే  అడుగడుగున్నా అడ్డుపడుతున్నారు. 

అందుకే తమ్ముళ్లూ.. నేను ముందే మేలుకున్నా.. పసుపు కుంకుమ, అన్నదాతా సుఖీభవ వంటి సొమ్ములు వివిధ పథకాల కింద ముందుగానే బ్యాంకు ఖాతాలో వేసేశానని ఒప్పేసుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు జనం ఓట్లను తన సొమ్ముతో కాకుండా ప్రభుత్వ సొమ్ముతో తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. 

ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ సభలో పంచుకున్నారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారుతోంది. స్వయంగా ఓ ముఖ్యమంత్రి.. తాను ఇలా తప్పు ఒప్పుకోవడం విశేషమే. ప్రభుత్వం ప్రజలకు సొమ్ముఇద్దామనుకుంటున్నా ప్రతిపక్షం అడ్డుపడుతోందన్న ఫీల్ రప్పించేందుకు చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: