ఏప్రిల్ 11.. ఇప్పుడు అందరి కళ్లూ ఈ రోజు మీదే.. తెలుగు ఓటరు తన తీర్పు చెప్పే రోజు ఇది. తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే కావడం వల్ల అంత ఇంట్రస్టు లేకపోయినా ఏపీ ఎన్నికలపై మాత్రం బీభత్సమైన ఆసక్తి నెలకొంది. ఆంధ్రా ఓటరు తీర్పు ఎలా ఉంటుందోన్న ఉత్కంఠ నెలకొంది. 


అయితే పోలింగ్ రోజు కొన్ని విశేషాలు జరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రదీప్‌ జోషి అనే జ్యోతిష్యుడు మాత్రం ఎన్నికల రోజు తప్పకుండా భారీ వర్షం పడుతుందని చెబుతున్నారు. కేవలం చెప్పడమే కాదు.. కావాలంటే లైవ్‌లు పెట్టుకుని చూసుకోండి.. అని మీడియాకే సవాల్ విసురుతున్నారు. 

ఓటర్లు వర్షంలో తడుస్తూనే పోలింగ్‌కు వెళ్లే దృశ్యాలు ఆరోజు అన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేస్తాయని.. కావాలంటే రాసిపెట్టుకోండని నమ్మకంగా చెబుతున్నారు. ఆయన జ్యోతిష్యం కరెక్టు కావాలంటే.. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ వర్షం జోరున కురవాలి. 

మరి అది సాధ్యమవుతుందా.. కేవలం కొన్ని చోట్ల మాత్రమే వర్షం పడుతుందా.. అన్నది చూడాలి. జోరు వర్షం వర్షం  వల్ల పోలింగ్ శాతం తగ్గే అకాశం ఉంటుంది. మరి ఇది ఎవరికి లాభిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉండే పోలింగ్‌ శాతం తక్కువ ఉండటం అధికార పార్టీకి లాభిస్తుంది.. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: