గుంటూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పగలూ, రాత్రి తేడా లేకుండా పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. తన ప్రచారంలో చంద్రబాబు, జయదేవ్‌ల వైఖరిని ఆయన తూర్పారపడుతున్నారు. 


2014లో వపన్ కల్యాణ్ తెలుగుదేశానికి తోడు ఉండటం వల్లే తాను అసెంబ్లీకి వెళ్లగలిగానని మోదుగుల చెప్పారు. ఆనాడు పవన్ కల్యాణ చంద్రబాబు ఉన్నాడు.. కాబట్టి ఆయన హీరో అయ్యారు.. కానీ ఈ రోజు పవన్ కల్యాణ్ చంద్రబాబుతో లేడు.. కాబట్టి ఆయన జీరో కావడం తథ్యమన్నారు. 

పనిలో పనిగా గుంటూరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌పై మోదుగుల సెటైర్లు వేశారు. ఆయనకు బియ్యం ఎక్కడ నుంచి వస్తాయో తెలియదన్నారు. మొన్న పొలంలోకి వెళ్లి బియ్యం చెట్లను అంటున్నాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రైతులకు దగ్గరకు వెళ్లి ఇంగ్లీష్ మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. 

దళిత వాడలకు వెళ్లి ఉర్దూ మాట్లాడతాడని గల్లా జయదేవ్‌పై మోదుగుల కామెంట్ చేశారు. ధూళిపాళ్ల నరేంద్రపైనా మోదుగు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ అన్నం తిని బతికితే.. ఆయన ఇసుక తిని బతుకుతున్నారని మండిపడ్డారు. ఈ అరాచకాలకు జగన్ గెలుపుతో త్వరలోనే అడ్డుపడుతుందని మోదుగుల అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: