వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు "ఆల్ ఇండియా బిసి ఫెడరేషన్" మాజీ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య. జగన్ ఏమన్నా పతివ్రతా? అంటూ విమర్శించారు. జగన్మోహనరెడ్డి పై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసునని, జగన్మోహనరెడ్డి పై ఉన్న కేసులు చదివి ఆశ్చర్యపోయానని జగన్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు. అవి నిలబడే కేసులు కావు అన్నారు.

అయితే  జగన్మోహనరెడ్డి బిసిల ద్రోహి అని, "వైసిపి మేనిఫెస్టో" అంతా బూటకమని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని, విజయసాయిరెడ్డికి బిసిల రిజర్వేషన్ల గురించి ఏం తెలుసునని, రిజర్వేషన్ ఇస్తామని బిసిలను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు.
justice eswaraiah on Chandrababu కోసం చిత్ర ఫలితం
ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా  "ఓటుకు నోటు కేసు" లో అడ్డంగా దొరికిపోయారని, జరగవలసిన పలుకేసుల విచారణలను "నిలుపుదలలు" (స్టేస్) ఉత్తర్వులు తెచ్చుకుని ఆయన తిరుగుతున్నారని,  "చంద్రబాబు చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నంత మాత్రాన ఉత్తముడు కాదు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.  ప్రభుత్వంలో భాగస్వామి కాని జగన్‌ దోషి ఎలా అవుతారు. జగన్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు. అవి నిలబడే కేసులు కావు" అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య స్పష్టంచేశారు. తెలంగాణాలో కెసిఆర్, ఎపిలో చంద్రబాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని ఆరోపణలు చేసు కోవడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. 

justice eswaraiah on Chandrababu కోసం చిత్ర ఫలితం

అగ్రకులాల వారు పూలే భావజాలాలను అణగదొక్కుతున్నారన్నారు. ఎన్టీఆర్‌ ఎంతో ఉన్నత ఆశయాలతో స్థాపించిన టీడీపీ బీసీల పార్టీగా మన్ననలు అందుకుంటే, చంద్రబాబు సొంత మామను వెన్నుపోటు పొడిచి యావత్తు బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ తదితర గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్‌ పథకాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని జస్టిస్‌ ఈశ్వరయ్య తెలిపారు. 

justice eswaraiah on Chandrababu కోసం చిత్ర ఫలితం

వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకోసం గొప్పపథకాలు ప్రవేశపెడితే, చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని జస్టిస్ ఈశ్వరయ్య విమర్శించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ పేరుతో చంద్రబాబు తన బినామీలకు వేల కోట్లు దోచి పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన ప్రతీ ప్రభుత్వ పథకంలో కుంభకోణం ఉందని ఆయన  దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రకటించే "ప్రతీ స్కీం లోనూ ఒక స్కాం" ఉంది

justice eswaraiah on Chandrababu కోసం చిత్ర ఫలితం

తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ, అమరావతి రాజధాని పేరిట "భారీ కుంభకోణం" జరిగిందని జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. చంద్రబాబు తొలుత ఈ ప్రాంతంలో తన బినామీలతో భూములు కొనుగోలు చేయించారనీ, ఆతర్వాతే రాజధాని ప్రాంతం ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బీసీలను మోసం చేశారనీ, టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన "బీసీ ప్లాన్ వట్టి బూటకం" అని వ్యాఖ్యానించారు. బీసీలు న్యాయమూర్తులుగా అవసరం లేదని చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గమన్నారు. 

justice eshwaraiah on Chandrababu కోసం చిత్ర ఫలితం

శరీరం అమ్ముకున్న వెలయాలికైనా కొంత నీతి, విలువ ఉంటుందని, ఈ రాజకీయ నాయకులకు ఆ విలువ ఏమాత్రం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో ఉన్నా  అగ్రవర్ణాల అభ్యర్ధులకు బిసీకి చెందిన వారు ఓటెయ్యవద్దని బిసిలకు పిలుపునిచ్చారు జస్టిస్ ఈశ్వరయ్య. 

justice eswaraiah on Chandrababu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: