శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో చాలా ముఖ్యమైన రోజు.. ఎందుకంటే.. రెండు ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించిన రోజు..తాము అధికారంలోకి వస్తే.. ప్రజలకు ఏం చేస్తామో చెప్పిన రోజు.. ఏపీ ప్రజల జీవితాలను సుభిక్షం చేస్తామంటూ భరోసా ఇచ్చిన ఉగాది రోజు. 


ముందు వైఎస్ జగన్ ఉదయం వేళ మేనిఫెస్టో ప్రకటించారు. గతంలో తాను ఇచ్చిన నవరత్నాల హమీలతో పాటు.. పాదయాత్రలోనూ, బీసీ సదస్సులోనూ ఇచ్చిన హామీలను కలిపి.. ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఈ ప్రణాళిక కేవలం 5 పేజీల్లో సూటిగా సుత్తి లేకుండా ఉంది. 

ఆ తర్వాత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో కూడా దాదాపు ఇవే హామీలతో ఉంది. జగన్ కంటే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చేందుకే.. చంద్రబాబు ప్రయత్నించారు. కానీ.. ఏదైనా జగన్ చెప్పాక.. చంద్రబాబు చెబుతుండటంతో చంద్రబాబు జగన్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. దీని వల్ల జగన్‌ కే పేరు వస్తుంది తప్ప చంద్రబాబుకు కాదు.

ఉదాహరణకు అమ్మఒడి పథకాన్ని జగన్ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు. పిల్లలు స్కూలుకు వెళ్తే తల్లిదండ్రులకు ఏడాదికి 15 వేలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఏడాదికి 18 వేలు ఇస్తామంటున్నారు.. ఇలా కాపీ కొట్టే పథకాలతో చంద్రబాబు విశ్వాసం పోగొట్టుకుంటున్నారు. దీనివల్ల జగన్‌కు వచ్చిన నష్టం ఏమీ ఉండకపోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: