టీడీపీ మంత్రి నారాయణ ఆర్ధిక బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున కోట్లు, కోట్లు ఖర్చు చేసినాడు. అయితే ఇప్పుడు నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ లో పోటీ చేయబోతున్నాడు. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా దీనిని చెప్పుకోవచ్చు. అందుకు కారణం.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రి నారాయణ పోటీ చేస్తూ ఉండటమే! ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చాకా టీడీపీ తరఫున నామినేటెడ్ పదవిని తీసుకుని మంత్రి అయ్యారు నారాయణ. అలా తెలుగుదేశంపై తనకున్న పట్టేమిటో నిరూపించుకున్నారు.


ఇక అంతటితో ఆగక.. నారాయణ ప్రత్యక్ష రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారంటే.. ఆయన తన విజయం మీద ఎంత నమ్మకంతో ఉన్నారో, ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. విద్యాసంస్థల యజమానిగా ఉన్నప్పుడు ‘నెల్లూరు నారాయణ’గా ఫేమస్ అయిన ఈయన ఇప్పుడు నెల్లూరు అర్బన్ నుంచినే తనసత్తా చూపించబోతూ ఉన్నారు. దీనికోసం పక్కా ప్రణాళికతో ఉన్నారాయన. ఆ విషయం గ్రౌండ్ లెవల్ పరిశీలనతో స్పష్టం అవుతోంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు.


ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఇవే.. అనిల్ కుమార్ యాదవ్ కు ఈసారి ఏమాత్రం తేలికకాదు. గట్టిపోటీ కాదు, తీవ్రమైన పోటీ ఉంటుంది. నారాయణ చాలా వ్యూహాత్మకంగా వెళ్తూ ఉన్నారు. ఆర్థికబలం విషయంలో నారాయణకు తిరుగు లేదని చెప్పనక్కర్లేదు. నారాయణతో పోల్చినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఆర్థిక శక్తి ఏ మూలకూ చాలదు!-అనుకూల పరిస్థితి లేకపోతే నారాయణ ఇక్కడ పోటీచేసి పరువు పోగొట్టుకొనే ప్రయత్నం చేయరు కదా! అనే కామెంట్లు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. నెల్లూరు అర్బన్ సీట్లో ఇప్పటికే ఓట్ల కొనుగోలు భారీగా సాగుతోందని సమాచారం. పార్టీ కండువా కప్పుకుని తిరిగే వారుంటే ఇంటికి పదివేలు కూడా ఆర్థికశక్తి గట్టిగా ఉన్న అభ్యర్థి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. పోలింగ్ నాటికి ఓటుకు  పదివేల రూపాయలు అయినా ఇవ్వగలరు.. ఇప్పటికే ఇంటింటికి సెల్ ఫోన్ ఐదువేలు పంచారని అక్కడ వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మహిళలకు వెండి పాత్రలు కూడా ఇచ్చి ఓట్ల కోసం ప్రమాణాలు వేయించుకుంటున్నారు టీడీపీ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: