ఏపీలో రాజకీయ మార్పు జరగడం తధ్యమన్న సూచనలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. ఏపీలో అయిదేళ్ళ టీడీపీ పాలనను చూసిన జనం మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపధ్యంలో ఏపీలో రాజకీయ చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

 


ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎన్నికల ప్రణాళిక విడుదల అయింది. దాంట్లో అన్ని వర్గాలకు జగన్ న్యాయం చేసేలా అనేక కీలకమైన అంశాలను పొందుపరచారు. అయితే ఈ మ్యానిఫేస్టోలో ముఖ్యంగా రైతులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులపైన గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. నాడు వైఎస్సార్ కి అండగా ఉన్న వర్గాలే ఇపుడు జగన్ వైపు మళ్ళుతున్నాయి. వారి అభివ్రుధ్ధిని ద్రుష్టిలో పెట్టుకునే జగన్ ఈ అంశాలకు ప్రాధ్యానత ఇచ్చారనిపిస్తుంది.

 


రైతుల కోసం జగన్ ఎన్నికల హామీలు అధికంగా కనిపిస్తాయి. గతంలో వైఎస్సార్ సమయంలో రైతులు చాలా దర్జాగా బతికారు. తిరిగి అటువంటి వాతావరణాన్ని వారు కోరుకుంటున్నారు. అయితే ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో వారు మోసపోయామని భావిస్తున్నారు. ముఖ్యంగా రైతు రుణ మాఫీ అంశంపై వారు బాబు చేయకపోవడం పట్ల విముఖంగా ఉన్నారు. ఇపుడు వారిని ఆర్ధికంగా ఇతరత్రా ఆదుకునేందుకు అనేక హామీలను జగన్ అందులో పొందుపరచారు

 


అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎపుడూ కాంగ్రెస్ పార్టీనే. విభజన తరువాత వారు టీడీపీ వైపు వచ్చారు. అనుభవం కొత్త రాష్ట్రం అన్న నినాదాలతో ఆ ఎన్నికలు జరిగాయి. ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. వారు యధాప్రకారం యాంటీ టీడీపీ లైన్ లోకి వచ్చేశారు. పైగా వారికి టీడీపీ సర్కార్ నుంచి సరైన పరిష్కారాలు కొన్నింటిని రావడంలేదు. సీబీఎస్ విధానం రద్దు అన్నది అతి ముఖ్యమైనది. దాన్ని రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. బాబు మానిఫేస్టోలో అది లేదు. అలాగే ఉద్యోగుల సమస్యలపైన కూడా జగన్ హామీలు అనేకం ఇచ్చారు.\

 


ఇక యువత ఉపాధి కోరుకుంటున్నారు. అయిదేళ్ళలో అది జరగలేదు. ఇంటర్ చదివితే చాలు నిరుద్యోగ బ్రుతి అంటున్నారు బాబు. అంతే తప్ప ఉద్యోగం వూసు ఎత్తడంలేదు. దాన్ని కరెక్ట్ గా పట్టుకున్నారు జగన్. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని ఆయన హామీ ఇవ్వడం వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతున్న్నది అంతా నమ్ముతున్నారు. మొత్తానికి ఈసారి జగన్ గెలిచేందుకు అన్ని అస్త్రాలు బాగానే ఉపయోగించారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: