నిన్న ఉగాది నాడు రెండు ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టో ను విడుదల చేశాయి. అయితే జగన్ .. టీడీపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ 2014లో ఉన్న హామీలు ఇప్పుడు ఏమయ్యాయని .. టీడీపీ అధికార సైట్ లోకి వెళ్లి చూస్తే కనిపించవని ఒక వేళ కనిపిస్తే నాకు చెప్పండని టీడీపీ మేనిఫెస్టో గురించి విమర్శలు గుప్పించాడు. తన మేనిఫెస్టో గురించి చెబుతూ తనకు అవకాశం ఇస్తే అన్నిటిని అమలు చేస్తానని హామీ ఇచ్చాడు. 


అయితే జగన్ పార్టీ వైకాపా మేనిఫెస్టో వ్యవహారం వేరు. ఎందుకంటే పదే పదే చంద్రబాబును ఈ హామీల మీదే నిలదీస్తున్నారు జగన్. ఇప్పుడు ఆయన వంతు అయితే రేపు చంద్రబాబు వంతురావచ్చు. జగన్ హామీలను నిలదీయవచ్చు. పైగా జగన్ తరచు ఓ మాట చెబుతుంటారు. తాను చేయగలిగిందే చెబుతాను తప్ప, చేయలేదని కాదు అని. అందువల్ల ఆయన ఇచ్చిన మేని ఫెస్టోను కాస్త నమ్మవచ్చు.


ఆ సంగతి ఎలా వున్నా, విడుదల చేసిన మేనిఫెస్టో మాత్రం బాగుంది. ముఖ్యంగా స్థానికులకే ఉద్యోగాలు అన్న దానిపై చట్టం చేయడం అన్నది గొప్పవిషయం. చిరకాలంగా వలసవాదులే ఉద్యోగాలు పొందుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డులను డబ్బులకు కొనుగోలు చేసి, స్థానికేతురులు ఎక్కువగా ఉద్యోగాలు పొందారన్న వ్యవహారం వుంది. ఇప్పుడు అలాంటివి అరికట్డం సాధ్యం అవుతుంది. అలాగే అన్ని వర్గాలకు పనికి వచ్చే వరాలు అనేకం వున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: