ఏపీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను కుదిపేయనున్నాయా. రేపటి రోజున జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పార్టీగా ఏపీ ఉంటుందా. కేంద్రంలో బలమైన పార్టీగా ఏపీ నుంచే ప్రజలు పంపిస్తారా. దేశంలో మళ్ళీ సంకీర్ణ శకం మొదలైన సమయంలో ఏపీ పాత్ర అత్యంత కీలకంగా మారనుందా.

 


ఈ ప్రశ్నలకు సమాధానం వైసీపీగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  ఇండియాటుడే చానల్‌ ‘పొలిటికల్‌ గ్లాడియేటర్‌’ పేరుతో వైఎస్‌ జగన్‌పై  ప్రత్యేక కార్యక్రమం  తాజాగా ప్రసారం చేసింది. ఇందులో జగన్ దేశం లో బలవంతమైన నేతగా ఎదుగుతున్నారని పేర్కొంది. రేపటి ఎన్నికల తరువాత జగన్ జాతీయ రాజకీయలను విపరీతంగా ప్రభావం చేస్తారని ఆ విశ్లేషణ పేర్కొంటోంది. ఎటువంటి పరిస్తితుల్లో ఏపీలో వైసీపీకి 18 ఎంపీ సీట్లు కంటే తక్కువ రావని స్పష్టంగా పేర్కొంటున్నాయి




అన్ని రకాల సర్వేలు. అదే సమయంలో దేశంలో వాతావరణం చూస్తే ఏ పార్టీకి మెజారిటీ రాని స్థితి ఉంది. దాంతో ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలను గెలిపించుకుని జగన్ కింగ్ మేకర్ అవతారం అక్కడ పోషిస్తారని పేర్కొంటున్నారు. ఏపీలో మంచి ఆధిక్యతతో అధికారంలోకి రావడమే కాకుండా కేంద్రంలో ప్రభుత్వానికి కూడా జగన్ ఎంపీలు కీలకమైన మద్దతు ఇస్తారని పేర్కొంటున్నారు. ఓ విధంగా రేపటి ఎన్నికల తరువాత జగన్ కీలకమైమైన  జాతీయ నేతల సరసన నిలిచి తన సత్తా చాటుకుంటారని కూడా  పేర్కొంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: