Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 9:31 pm IST

Menu &Sections

Search

హాట్ సీట్ : ఆ కోస్తా మంత్రి ఓడిపోతున్నాడా... అక్క‌డ వైసీపీ గెలుపు గ్యారెంటీయే...!

 హాట్ సీట్ : ఆ కోస్తా మంత్రి ఓడిపోతున్నాడా... అక్క‌డ వైసీపీ గెలుపు గ్యారెంటీయే...!
హాట్ సీట్ : ఆ కోస్తా మంత్రి ఓడిపోతున్నాడా... అక్క‌డ వైసీపీ గెలుపు గ్యారెంటీయే...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో గత కొన్ని సాధారణ ఎన్నికలను పరిశీలిస్తే సిట్టింగ్‌ మంత్రులు ఓడిపోవడం ఓ సెంటిమెంట్‌గా కంటిన్యూ అవుతూ వస్తోంది. 2004లో నాటి సమైఖ్య‌ రాష్ట్రంలో చంద్రబాబు మంత్రి వర్గంలో ఉన్న మహామహులు చాలా మంది ఓడిపోయారు. 2009లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రెండో సారి సీఎం అయినా ఆయన కేబినెట్‌లో మంత్రులుగా పని చేసిన వారిలో కీలక నేతలంతా ఘోరంగా ఓడిపోయారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడు, మంత్రిగా ఉన్న డి. శ్రీనివాస్‌తో పాటు నాడు మంత్రులుగా ఉన్న మహ్మద్ ఫ‌రీదుద్దీన్‌, పిన్నమనేని వెంకటేశ్వరరావు, రెడ్డివారి చెంగారెడ్డి, షబ్బీర్‌ ఆలీ, సంభాని చంద్రశేఖర్‌, వనమా వెంకటేశ్వరరావు లాంటి కీలక మంత్రులంతా ఓడిపోయారు. ఇక గత ఏడాది చివరిలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని ప్రభంజనంతో మరో సారి అధికారంలోకి వచ్చింది. ఇంత ప్రభంజనంలోనూ కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న మహేందర్‌ రెడ్డి, అజ్మీరా చందూలాల్‌, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో పాటు స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి సైతం ఓడిపోయారు. దీనిని బట్టీ మంత్రులుగా ఉన్నా సొంత నియోజకవర్గాలను పట్టించుకోకపోతే ఎలాంటి వారికైనా ఓటమి తప్పదని తెలుగు రాజకీయాల్లో పదే పదే రుజువు అవుతోంది. 


తాజాగా ఏపీలో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లోనూ చంద్రబాబు కేబినెట్‌లో ఉన్న కొందరు మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు ఏటికి ఎదురీదుతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఈ లిస్ట్‌లో ఆరేడుగురు మంత్రుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా రాజధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలోని వేమూరు నుంచి ప్రాధినిత్యం వహిస్తున్న నక్కా ఆనంద్‌ బాబు సైతం ఈ లిస్ట్‌లో ఉన్నారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి 2009, 2014 రెండు ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలుస్తూ వస్తున్న ఆనంద్‌ బాబు ఆ సారి గెలిచే పరిస్థితి లేదని తెలుస్తోంది. 2009 నియోజకవర్గాల పున‌ర్విభజనలో వేమూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యింది. ఈ నియోజకవర్గం నుంచి 2009లో తొలి సారి టీడీపీ తరపున పోటీ చేసిన ఆనంద్‌ బాబు నాటి కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మ‌న్‌ మేరుగు నాగార్జునపై కేవలం 2000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో నాగార్జున వైసీపీ నుంచి పోటీ చెయ్యగా మళ్ళీ ఆనంద్‌ బాబు జిల్లాల్లో టీడీపీ గాలులు బలంగా వీచినా మళ్ళీ 2000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రెండు ఎన్నికల్లో చివరి వరకు మేరుగు నాగార్జున ఆధిక్యంలో ఉన్నా చివరి రౌండ్లలో ఫలితం తారుమారు కావడంతో ఆయన గెలుపుకు దూరం కావాల్సి వచ్చింది. 


వరుసగా రెండు సార్లు ఓడిపోయినా నాగార్జున మాత్రం పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటూ వచ్చారు. రెండు సార్లు ఓడిపోవడంతో ఉన్న సానుకూల పరిణామాలతో పాట నియోజకవర్గంలో మంత్రి ఆనంద్‌ బాబుపై ఉన్న వ్యతిరేఖత, టీడీపీలోనే ఆయన వర్గ రాజకీయాలు చెయ్యడంతో ఓ వర్గం ఆయనకు పూర్తిగా దూరం కావడం, సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కొందరు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేఖించడం ఆనంద్‌ బాబుకు పెద్ద మైన‌స్‌గా ఉన్నాయి. అదే విధంగా లంక గ్రామాలు ఉన్న మండలాలు అయిన కొల్లూరు, భ‌ట్టిప్రోలు మండలాల్లో ఆనంద్‌ బాబుకు తీవ్రమైన వ్యతిరేఖత కనిపిస్తోంది. వాస్తవంగా చూస్తే ఈ రెండు మండలాలు టీడీపీకి కంచుకోటలు. ఇక గతంలో రేపల్లే ఎమ్మెల్యేగా పని చేసి గత ఎన్నికల్లో ఆనంద్‌ బాబు గెలుపులో కీలక పాత్ర పోషించిన దేవినేని మల్లికార్జునరావు తాజాగా వైసీపీలోకి జంప్‌ చేసేశారు. రేపల్లే, వేమూరు నియోజకవర్గాల్లో మంచి పట్టున్న మల్లికార్జునరావు ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 


మంత్రిగా ఉన్నా ఆయన నియోజకవర్గానికి మంత్రి స్థాయిలో చేసిందేమి లేదన్న అపవాదు సైతం టీడీపీ వర్గాల్లోనే ఉంది. ఇక ఎన్నికలకు ముందు దేవినేని మల్లికార్జునరావు వైసీపీలోకి వెళ్లడం ఆనంద్‌ బాబుకు మామూలు షాక్‌ కాదనే చెప్పాలి. ఇక జిల్లాల్లో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వేమూరు ఒకటి. జనసేన గుంటూరు జిల్లాలో గుంటూరు వెస్ట్‌, ప్రత్తిపాడు నియోజకవర్గాల తర్వాత ఎక్కువ ప్రభావం చూపే నియోజకవర్గం వేమూరు. గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ టీడీపీకి సపోర్ట్‌ చెయ్యడం కూడా ఆనంద్‌ బాబుకు కలిసి వచ్చింది. అన్ని అనుకూల అంశాలు ఉన్నా సరే ఆనంద్‌ బాబుకు కేవలం 2000 ఓట్ల మెజారిటీనే వచ్చింది. గత ఎన్నికల్లో ఆనంద్‌ బాబుకు పూర్తి సానుకూలంగా ఉన్న ఆరేడు అంశాలు ఇప్పుడు ఆయనకు తీవ్రమైన మైన‌సులుగా మారాయి. దీనికి తోడు వ్యక్తిగతంగా ఆయనపై ఉన్న వ్యతిరేఖత నేపథ్యంలో వేమూరులో మంత్రి ఓటమి బాటలో ఉన్నారనే ప్రచారం టీడీపీ వర్గాల్లోనే జోరుగా జరుగుతోంది. ఇదే టైమ్‌లో నాగార్జున అన్ని వర్గాలను కలుపుకుని దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వేమూరులో ఉన్న పొలిటికల్‌ గ్రౌండ్‌ రిపోర్ట్‌ని బట్టీ చూస్తే మంత్రి గెలుపు ఆసాధ్యంగానే కనిపిస్తోంది


ap-election-2019-andhrapradesh-tdp-cm-chandrababu-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఓలప్ప నేనొప్పనంతే... ఈసీకి బాబోరి లేఖాస్త్రం
వైసీపీ గెలిస్తే టీటీడీ చైర్మ‌న్ ఆయ‌న‌కే... బెర్త్ ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌..!
ఓరి దేవుడా... ప్లాప్ డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్ రీ ఎంట్రీ... ప‌క్కా ప్లాపే
మ‌హ‌ర్షి ర‌న్ టైం డీటైల్స్‌... ఒక్క‌టే టెన్ష‌న్‌
అయ్యో వినాయ‌క్‌... నిండా మునిగిపోయాడు...!
బాబుగారు ఇలా కూడా దోచేస్తున్నారు... స‌రికొత్త దోపిడీ...
ఆఖ‌రుకు ఆ విష‌యంలోనూ... బాబోరి అక్కౌంట్‌లో మ‌రో చెత్త రికార్డ్‌
త్వరలో వైసీపీ గూటికి టీడీపీ ఎంపీ.... బెర్త్ రిజ‌ర్వ్‌...!
ప్ర‌భాస్ త‌ప్పు చేస్తున్నాడా... తేడా వ‌స్తే ఖేల్ ఖ‌తం...దుకాణం బందే
దేవిశ్రీకి మెగా షాక్‌... ఘోర అవ‌మాన‌మే..!
ఇద్ద‌రు హిట్ డైరెక్ట‌ర్ల‌తో బాల‌య్య ఫిక్స్‌... టాప్ లేపే ప్రాజెక్ట్స్‌
' మ‌హ‌ర్షి ' మానియా స్టార్ట్‌.... టిక్కెట్ల రేట్లు చూస్తే క‌ళ్లు జిగేల్‌
ఆ ముగ్గురు పార్టీ నేత‌ల గెలుపుపై జ‌గ‌న్ గురి..!
టీడీపీ కాల‌కేయుడికి ఓట‌మి భ‌యం.. గ‌ప్‌చుప్ వెన‌క‌..!
మూడు ద‌శ‌ల పోలింగ్‌... క‌మ‌లం వాడింది... మోడీకి ఢిల్లీ పీఠం క‌ష్ట‌మే..!
నానిపై తీవ్రంగా ఫైర్ అయిన ' శ్రీరెడ్డి ' ... క‌ర్మ‌రా బాబూ అంటూ
R R R ఎన్టీఆర్‌ హీరోయిన్‌ను రిక‌మెండ్ చేసిన స్టార్ హీరో...
మ‌జిలీ ఎఫెక్ట్‌... ' స‌మంత ' రేటు పెంచేసింది...!
ఆ టీడీపీ సీనియర్‌కు వరుసగా ఐదో ఓట‌మేనా..!
ఆ వైసీపీ సీనియ‌ర్ గెలుపు గ్యారెంటీ... ఏపీ పాలిటిక్స్‌లో చ‌క్రం తిప్పే ఛాన్స్‌...
వైసీపీ మాజీ మంత్రికి సెంటిమెంటే గెలుపు అస్త్రం...
అన్న‌దాత ఆగ్ర‌హం... ఆ టీడీపీ ఎమ్మెల్యేకి ఎఫెక్టేనా...!
బాబు ప్లాన్ తుస్‌... మంత్రి వియ్యంకుడికి మ‌ళ్లీ ఓట‌మే... !
ఆ వైసీపీ ఎమ్మెల్యే అక్క‌డ రారాజే... జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ ఫిక్స్‌...!
బాబోరి ఓటమికి సాకులే సాకులు... ఫైన‌ల్ షాక్ ఇదే
సీఎం రివ్యూ వర్సెస్ సీఎస్ రివ్యూ : దేశంలోనే మొాదటిసారిగా ఏపిలో - రాజ్యంగ సంక్షోభమవ్వదు కదా?
ఇంట‌ర్ బోర్డులో `గ్లోబ‌రీనా` తుఫాను.. ఏం జ‌రిగింది?
టీడీపీ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఆశ‌ల‌పై నీళ్లు.. ఏం జ‌రుగుతోందంటే..!
గుడివాడ‌పై భారీ బెట్టింగ్‌.... కోట్ల‌లో మునుగడం ప‌క్కా..
బాబు దుబారా ఎఫెక్ట్‌:  చేతులెత్తేసిన ఏపీ... ఉద్యోగుల‌కు వేత‌నాలు నిల్
40 ఏళ్ల అనుభ‌వం రాష్ట్రాన్ని ఎంత‌లా ముంచేసిందంటే...
40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ దెబ్బ‌... ఏపీలో కాంట్రాక్ట‌ర్లు ల‌బోదిబో...
అభ్య‌ర్థుల స‌మీక్ష‌లోనే ఓట‌మి ఒప్పుకున్న చంద్ర‌బాబు... కార‌ణాలు ఇవే
బ్యాడ్ ల‌క్ నాని... జెర్సీ క‌లెక్ష‌న్స్ డ్రాప్ వెన‌క ఆ ఇద్ద‌రు
R R R ఎన్టీఆర్‌కు షాక్... తలపట్టుకుంటున్న రాజమౌళి..!
తల్లిదండ్రుల విడాకుల కారణం చెప్పిన  మెగా మేనల్లుడు
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.