రూరల్ మీడియా.. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ పరిస్థితులపై రిపోర్టింగ్ చేసే మీడియా.. కమర్షియల్ హంగులు లేకుండా.. సేవాభావంతో గ్రామీణ సమస్యలను ప్రపంచానికి నివేదించడమే ఈ మీడియా లక్ష్యం.. ఈ సంస్థ తాజాగా ఏపీలోని ఎన్నికల నేపథ్యంలో సర్వే నిర్వహించింది. 


ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని  రూరల్‌ మీడియా ర్యాండమ్‌ సర్వేలో స్సష్టంగా తేలింది. ఫిబ్రవరి 3 నుండి మార్చి నెలాఖరు వరకు, రాస్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో మారుమూల పల్లెల్లో నిర్వహించిన ఈ సర్వేలో ప్రజల స్సందన తెలుసుకునే ప్రయత్నం జరిగింది.



ఐతే.. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రమంతటా పోటీ చేసినా.. కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే గెలుస్తుందని ఈ సర్వే చెప్పింది. అది కూడా విశాఖ పట్నంలోని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక మాత్రమే.. అంటే పవన్ కల్యాణ్ భీమవరంలోనూ ఓడిపోబోతున్నాడన్నమాట. 


ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం నామమాత్రమే అని ఈ సర్వే తెలిపింది. కొన్నిచోట్ల ఓట్లు చీల్చగలగడం తప్ప ఈ పార్టీ ప్రభావం ఉండదని అంచనా వేసింది. పవన్ కల్యాణ్ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నా.. ఆ పార్టీకి దక్కేది కేవలం ఒకే ఒక్క స్థానమేనని చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది.  ఇది ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే.. ఎప్పటికప్పుడు సర్వే అప్ డేట్ అవుతుంది..మరి చూడాలి ఏంజరుగుతుందో.  https://ruralmedia.in/rural-media-opinion-poll/

మరింత సమాచారం తెలుసుకోండి: